‘పుష్ప 2’ (Pushpa 2) తర్వాత అల్లు అర్జున్ కు (Allu Arjun) కొంత బ్రేక్ వచ్చింది. దీంతో హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ వస్తున్నాడు. మరోపక్క అట్లీ సినిమా కోసం కొత్త ట్రైనర్ ను పెట్టుకుని జిమ్లో కసరత్తులు కూడా చేస్తున్నాడు. ‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్ రేంజ్ పెరిగింది.ఇప్పుడు అతను పాన్ ఇండియా లెవెల్లో సూపర్ స్టార్. అందుకు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై చాలా కేర్ తీసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే.. ఆమిర్ ఖాన్ (Aamir Khan) ఇంట్లో అల్లు అర్జున్ ఉన్న ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
వీరి మధ్యలో ఉన్న వ్యక్తి ఫింగర్స్ క్రాస్డ్ అన్నట్టు విక్టరీ సింబల్ ను చూపిస్తున్నాడు. దీంతో ఈ కాంబో ఫిక్స్ అయిపోయింది అని అంతా అనుకుంటున్నారు. అల్లు అర్జున్ త్వరలో అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. దీన్ని ‘సన్ పిక్చర్స్’ సంస్థ దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు అని కాన్సెప్ట్ వీడియోతోనే స్పష్టం చేశారు. ఫ్యూచరిస్టిక్ అప్రోచ్ ఉంటుందని కొందరు భావిస్తున్నారు.
‘అవతార్’ రేంజ్ వీఎఫెక్స్ ఉండటం కూడా గ్యారెంటీ అని అంటున్నారు. మరోపక్క ఆమిర్ ఖాన్ ఈ సినిమాలో నటిస్తున్నది లేనిదీ క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ ఈ కాంబో ఫిక్స్ అయితే.. సినిమాకి నెక్స్ట్ లెవెల్ హైప్ జెనరేట్ అవ్వడం ఖాయం. అలాగే బాక్సాఫీస్ వద్ద రూ.2000 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.