Bindu Madhavi: బిగ్ బాస్ లో ఈవారం జైల్ లోకి బిందు వెళ్లిన కారణం అదేనా ?

బిగ్ బాస్ హౌస్ లో ఈవారం వరెస్ట్ పెర్పామర్ గా బిందు జైల్ కి వెళ్లింది. అయితే, ఈసారి బెస్ట్ ఫ్రెండ్ అయిన శివనే బిందుని వరెస్ట్ అనడం అనేది తీసుకోలేకపోయింది. ఒక్కసారిగా కళ్లనీళ్లు పెట్టుకుంది. తనకి బెస్ట్ ఫ్రెండ్ అయిన శివనే వరెస్ట్ అంటూ నుదిటిపై స్టాంప్ గుద్దాడు. రోబో క్వాయిన్స్ టాస్క్ లో క్వాయిన్స్ ని సరిగ్గా కాపాడుకోవడంలో బిందుమాధవి విఫలం అయ్యింది. హమీదా రెండు మూడుసార్లు హెచ్చరించి మరీ బిందు దగ్గర క్వాయిన్స్ కొట్టేసింది.

నిజానికి బిందు హమీదా ఇంకా శివలతో కలిసి గేమ్ ఆడదాం అనుకుంది. అందుకే, హమీదా దగ్గర ఈజీగా క్వాయిన్స్ పెట్టింది. ఇదే పాయింట్ పట్టుకుని హౌస్ లో మెజారిటీ ఓటింగ్ బిందుకి వేశారు. వరెస్ట్ పెర్ఫామర్ గా డిసైడ్ చేసారు. అసలు గేమ్ లో జరిగిందేంటంటే.., రోబో టాస్క్ లో కంపెనీ గా వ్యవహరించిన బిందు దగ్గర 300 క్వాయిన్స్ ఉన్నాయి. ఒక్కో రోబో పార్ట్స్ ని ఈ క్వాయిన్స్ ఇచ్చి సప్లయిర్స్ దగ్గర బిందు కొనుక్కోవాలి.

కానీ, హమీదా పక్కన కూర్చున్న బిందు అక్కడ క్వాయిన్స్ పెట్టింది. ఇదే అదనుగా చూసుకుని హమీదా బిందు క్వాయిన్స్ కొట్టేసింది. దీంతో బిందు మాధవి గేమ్ లో లేకుండా పోయింది. ఫస్ట్ రౌండ్ లోనే అవుట్ అయ్యింది. హమీదాని నమ్మచ్చనుకున్న బిందుకి ఛేదు అనుభవం ఎదురయ్యింది. ఆ తర్వాత హమీదాని బ్రతిమిలాడినా కూడా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. అషూరెడ్డి, అఖిల్, శివ, అనిల్ ఇలా మెజారిటీ ఓటింగ్ అనేది బిందుమాధవికి వేశారు.

నిజానికి ఈపాయింట్ ని చాలా బలంగా వాదించాడు మహేష్ విట్టా. బిందుమాధవి అమాయకత్వంతో క్వాయిన్స్ పోగొట్టుకుంటే, కెప్టెన్సీ టాస్క్ లో నువ్వు అషూరెడ్డికి సపోర్ట్ చేసి కెప్టెన్ అవ్వలేకపోయావ్ చూశావా అంటూ మహేష్ హమీదాని వరెస్ట్ పెర్ఫామర్ గా ఓటు వేశాడు. బిందుమాధవి ఫ్లవర్ అయితే, హమీదా క్లవర్ గా టాస్క్ ఆడింది. కానీ, ఆ తర్వాత అషూకి సపోర్ట్ చేసిన హమీదా చివరకి అదే అషూ చేతిలో ఓడిపోయి కెప్టెన్ అవ్వలేకపోయింది. అషూకి కేవలం ఒకే ఒక్క కత్తిపోటు వస్తే, హమీదాకి రెండు వచ్చాయి.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus