Bigg Boss 5 Telugu: అసలు షణ్ముక్ కి సిరికి ఎందుకు చెడిందో తెలుసా..?

బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ జరుగుతోంది. ఇందులో భాగంగా నీ ఇల్లు బంగారం కానూ అంటూ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. గోల్డ్ మైన్స్ లో దిగి గోల్డ్ ని ఎతుక్కుని హౌస్ మేట్స్ అందరూ వారికి ఇచ్చిన కేస్ లలో భద్రపరుచుకోవాలి. పవర్ థండర్ మోగినపుడు పవర్ రూమ్ యాక్సెస్ ఎవరైతే పొందుతారో వారికి ప్రత్యేకమైన పవర్ లభిస్తుంది. ఫస్ట్ బజర్ మోగినపుడు ఏ ఇద్దరి దగ్గరైతే ఎక్కువ గోల్డ్ బాల్స్ ఉంటాయో వాళ్లకి మరో ఛాలెంజ్ ఇస్తాడు బిగ్ బాస్. ఆ ఛాలెంజ్ లో గెలిచిన వాళ్లు కెప్టెన్సీ పోటీదారులు అవుతారు. ఇక్కడే సిరి షణ్ముక్ ఇద్దరూ కూడా మూడ్ ఆఫ్ అయ్యారు. ఒకవైపు పార్టిసిపెంట్స్ టాస్క్ ఆడుతుంటే వీరిద్దరి మద్యలో ఎమోషనల్ టాస్క్ నడిచింది.

నిజానికి టాస్క్ ప్రారంభం అవ్వకముందే ఇద్దరి మద్యలో ఆర్గ్యూమెంట్ చోటు చేసుకుంది. సిరి గేమ్ ని ఎనలైజ్ చేస్తూ షణ్ముక్ సలహాలు ఇచ్చాడు. ఈసారి సన్నీని అన్నయ్యా అని పిలుపు అప్పుడు నిన్ను ఎలా తిడతాడో నేను చూస్తా అంటూ మాట్లాడాడు. అంతేకాదు, స్ట్రయిట్ గా ముఖంపైనే వెళ్లు చెప్పు ప్రాబ్లమ్ ఉందని అంటూ ఫోర్స్ చేశాడు. ఇక్కడే సిరి నా గేమ్ నేను ఆడుకుంటాను కదా.. ఎందుకు ఖంగారు పడుతున్నావ్ అంటూ షణ్ముక్ పైన చిర్రుబుర్రులాడింది. ఆ తర్వాత టాస్క్ మొదలైనపుడు సిరికి షణ్ముక్ సలహా ఇచ్చాడు. ఫస్ట్ బజర్ వచ్చినపుడు నా గోల్డ్ బాల్స్ నీకు ఇస్తాను నువ్వు పార్టిసిపేట్ చేయి అన్నాడు. ఇదే విషయాన్ని రవి కూడా సలహా ఇచ్చాడు. మీరిద్దరూ కలిసి ఎక్కువ బాల్స్ పెట్టుకోండి.

అప్పుడు కెప్టెన్సీ పోటీదారులు అవ్వచ్చు కదా అన్నాడు. ఇక్కడే సిరి షణ్ముక్ అన్న మాటలకి హర్ట్ అయ్యింది. ఇక ఎప్పుడూ ఉండేలాగానే ఇద్దరూ కొట్టుకున్నారు. బెడ్ పైన కూర్చుని ఉన్న షణ్ముక్ నీ ముఖం చూస్తునే చిరాకు వచ్చేస్తోంది. ఇక్కడ్నుంచీ వెళ్లిపో అంటూ సిరిని షణ్ముక్ గద్దించి మరీ చెప్పాడు. దీంతో సిరి అలిగింది. బాగా బాధపడింది. అయితే, అక్కడ సన్నీ నామినేషన్స్ అప్పుడు ఏం జరిగింది అనేది అందర్నీ ఇమిటేషన్ చేస్తుంటే నవ్వుతూ ఎంజాయ్ చేసింది. ఇక్కడే షణ్ముక్ కి బాగా కాలింది. ఇలా చేస్తే నువ్వు తగ్గిపోతావ్ అంటూ మరోసారి సిరి గేమ్ గురించి మాట్లాడాడు. నువ్వు డబుల్ ఫేస్ అని నిరూపించుకుంటున్నావ్ అన్నాడు. నాతో ఇలా ఉండకు, నన్ను మర్చిపో ఇక్కడ్నుంచీ వెళ్లిపో అంటూ మాట్లాడాడు షమ్ముక్.

దీంతో సిరి బాగా ఏడ్చేసింది. ఆతర్వాత వాష్ రూమ్ లో ఒంటరిగా కూర్చుని ఉన్న షణ్ముక్ ఏడుస్తుంటే మరోసారి ఓదార్చడానికి వచ్చింది. ఇద్దరూ బాగా ఎమోషనల్ అయ్యారు. ఇక్కడే షణ్ముక్ చాలా మాటలు అనేశాడు. నువ్వున్నా లేకపోయినా నాకు ఫరఖ్ పడదు అన్నాడు. దుఃఖాన్ని మింగుకుంటూ నాకు ఎవరూ లేరని ఈ టైమ్ లో దీప్తి ఉంటే బాగుండేదని ఏడ్చేశాడు. సిరిని దూరం పెడుతుంటే సిరి ఏడుపు ఆపుకోలేకపోయింది. ప్రస్టేషన్ తో కోపంతో వాష్ రూమ్ లోకి వెళ్లి గోడకి కొట్టుకుంటూ మరీ ఏడ్చేసింది. దీంతో హౌస్ మేట్స్ అందరూ వచ్చి సిరిని ఓదార్చే ప్రయత్నం చేశారు. షణ్ముక్ కూడా దగ్గరకి తీస్కుని ఓదార్చాడు. దీంతో సిరి కాసేపు కూల్ అయ్యింది. అదీ మేటర్.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus