Bindu, Nataraj: నటరాజ్ మాస్టర్ బిందునే ఎందుకు టార్గెట్ చేశారు..! రిజల్ట్స్ ముందే తెలిసిందా..?

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో 11వ వారం పెద్ద యుద్ధమే జరిగింది. నటరాజ్ మాస్టర్ కి ఇంకా బిందు మాధవికి జరిగిన ఆర్గ్యూమెంట్స్ పర్సనల్ గా కూడా వెళ్లాయి. బిందు మాధవి మాస్టర్ మాటలకి పక్కకి తిరిగి ఉమ్మేస్తూ మరీ కౌంటర్ ఎటాక్ చేసింది. ఇది హౌస్ మేట్స్ కి నచ్చలేదు. అంతేకాదు, అఖిల్ ఈ విషయాన్ని బిందుని నామినేట్ చేస్తూ సూటిగా ప్రశ్నించాడు. అఖిల్ కి ఇంకా బిందుకి కూడా పెద్ద ఆర్గ్యూమెంట్ జరిగింది. నాకు మానవత్వం ఉంది అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ బిందు రెచ్చిపోయింది.

దీనికి కౌంటర్ గా నీ మానవత్వం ఇక్కడే కనిపిస్తోందిలే అంటూ అఖిల్ రెచ్చిపోయాడు. అత్యంత నాటకీయంగా జరిగిన ఈ నామినేషన్స్ ప్రక్రియలో నటరాజ్ మాస్టర్, అఖిల్, బిందు, శివ , మిత్రాలు హైలెట్ అయ్యారు. మిత్రా ఇంకా శివ మద్యలో కూడా ఎప్పటిలాగానే పెద్ద మాటల యుద్ధం జరిగింది. ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లుగా మాట్లాడుకున్నారు. మొత్తానికి ఇన్ని వారాల తర్వాత ఎవరి యాష్ ట్యాగ్ వాళ్లు చెప్పుకుంటూ ఓపెన్ అప్ అయ్యారు. అంతేకాదు, అఖిల్ – నటరాజ్ మాస్టర్ మాటలు వింటుంటే, విన్నర్ ఎవరో ముందుగానే హౌస్ లో అందరికీ తెలిసిపోయిందా అని అనిపించింది.

నటరాజ్ మాస్టర్ అయితే డైరెక్ట్ గానే బిందుకి కౌంటర్ వేశారు. చెన్నై నుంచీ వచ్చావ్ అని, మళ్లీ షో అయిపోగానే చెన్నై వెళ్లిపోతావ్ అని, మేము ఇక్కడే ఉండాలి అంటూ మాట్లాడారు. ఇక్కడ ప్రాంతీయ భావాన్నీ తీసుకుని రావడం అనేది కొంతమందికి నచ్చలేదు. బాబాభాస్కర్ నటరాజ్ ని ఇదే కారణంతో నామినేట్ కూడా చేశారు. ఈవారం టాప్ – 5లో ఉండే అర్హత లేదంటూ బిందుని నామినేట్ చేశారు అఖిల్ ఇంకా నటరాజ్ మాస్టర్. అంతేకాదు, అసలు నీ గేమ్ ఏంటి అంటూ ప్రశ్నించారు మాస్టర్.

దీన్ని బట్టీ చూస్తుంటే విన్నర్ బిందు అవ్వబోతోందని ముందుగానే ఊహించి ఇలా టార్గెట్ చేస్తున్నారా అని బిగ్ బాస్ ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు, కావాలనే బిందుని రెచ్చగొట్టారు అని, తను బరెస్ట్ అయితే వాళ్లకే బెనిఫిట్ వస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయినా కూడా బిందు చాలా నిబ్బరంగా ఉందని, అన్ని మాటలు పర్సనల్ గా అంటున్నా చాలా స్ట్రాంగ్ గా పోరాడిందని పొగుడుతున్నారు. ఏది ఏమైనా ఈవారం నామినేషన్స్ లో మాస్క్ లు లేకుండా అందరూ టాస్క్ ల గురుంచే మాట్లాడుకున్నారు. ఎవరు ఎలా ఇంత దూరం వచ్చారు అనేది మాట్లాడుతూ రెచ్చిపోయారు.

నటరాజ్ మాస్టర్ అయితే బిందుని పదే పదే మాటలతో రెచ్చగొట్టారు. నటరాజ్ మాస్టర్ నామినేట్ చేస్తున్నప్పుడు బిందు కూడా రెచ్చిపోయి మరీ ప్రవర్తించింది. ఇద్దరూ కూడా నువ్వెంత అంటే నువ్వెంత అనే స్టేజ్ వరకూ వెళ్లారు. ముఖ్యంగా ఫ్యామీలీ మెంబర్స్ ఎపిసోడ్ అయిన దగ్గర్నుంచీ హౌస్ లోకి హింట్స్ గట్టిగానే వెళ్లాయి. దీన్ని బట్టీ బయట ఓటింగ్ పర్సెంటేజ్ ఎవరికి ఎక్కువగా ఉందో ఒక అంచనాకి వచ్చారు. బిందు విన్నర్ అవ్వబోతోందని తెలిసి మాస్టర్ కావాలనే కౌంటర్ ఎటాక్ చేశారనే ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి అదీ మేటర్.

దొంగాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus