అందుకే ఈ సినిమా అన్ని భాషల్లో వస్తోందా..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టైలిష్ మేకర్ సుకుమార్ ఇద్దరూ కలిసి చేస్తున్న హ్యాట్రిక్ సినిమా పుష్ప. ఇప్పుడు ఈ సినిమాని హాలీవుడ్ రేంజ్ లో మేక్ చేస్తున్నారా అంటే నిజమే అంటున్నారు ఫిలిం నగర్ తమ్ముళ్లు. ఇంతకీ మేటర్ ఏటంటే, ఈ సినిమాతో పుష్ప రాజ్ గా అన్ని భాషల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు బన్నీ. ముఖ్యంగా బాలీవుడ్ మార్కెట్ లో సత్తా చాటేందుకు రెడీగా ఉన్నాడు. ప్యాన్ ఇండియా మార్కెట్ ని పుష్ప తో గట్టిగానే కొట్టాలని చూస్తున్నాడు.

అందుకే సినిమా మేకింగ్ లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సీన్స్ ని తీస్తున్నట్లుగా సమాచారం. లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్ చాలాకాలం ఆగిపోయినా కూడా ఇప్పుడు శరవేగంగా షెడ్యూల్ పూర్తి చేస్కోబోతోందట. ముఖ్యంగా అడవుల్లో స్టంట్ ని చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేసినట్లుగా సమాచారం. దీనికోసం హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్స్ సినిమా యూనిట్ తో జాయిన్ అవ్వబోతున్నారని అంటున్నారు. హాలీవుడ్ రేంజ్ లో సినిమా స్క్రీన్ పైన ఉండబోతోందని, చాలా రఫ్ అండ్ టఫ్ లుక్ లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తాడని అంటున్నారు.

మరోవైపు ఈ సినిమాని మేకర్స్ ఐదు భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో ఈసినిమా విడుదల కాబోతోంది. ఇంకా రెండు భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రష్మిక మందన హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus