Prabhas, Rajamouli: రాధేశ్యామ్ ను మీరెందుకు ప్రమోట్ చేస్తున్నారు?

దర్శకుడు రాజమౌళి అప్పుడప్పుడు కొన్ని మంచి సినిమాలకు ప్రమోషన్ చేసే విధంగా అడుగులు వేస్తూ ఉంటారు. ఇక ఈ సారి ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమా లో కూడా తన వంతు సహాయంగా ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు. ఇక చత్రపతి సినిమాతో ప్రభాస్ తో మంచి బాండింగ్ ఏర్పరుచుకున్న రాజమౌళి ఆ తర్వాత బాహుబలి సినిమా వరకు మంచి స్నేహాన్ని కొనసాగించారు. ఇద్దరు కూడా చాలా మంచి మిత్రులుగా కూడా ఉంటారు.

Click Here To Watch Now

ఒక విధంగా ప్రభాస్ అయితే రాజమౌళి ని గాడ్ ఫాదర్ లాగా భావిస్తాడు ఆయన నుంచి ప్రతి క్షణం ఏదో ఒకటి నేర్చుకుంటానని ప్రభాస్ ప్రతి ఇంటర్వ్యూలో కూడా చెబుతూనే ఉంటారు. ఇక రీసెంట్ గా రాధే శ్యామ్ సినిమాకోసం ప్రత్యేకంగా రాజమౌళి ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. ప్రభాస్ ను ప్రశ్నలు అడుగుతూ రాధే శ్యామ్ సినిమా గురించి అనేక విషయాలు చర్చలోకి తీసుకువచ్చారు. అయితే ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి ఇంటర్వ్యూ చేయడానికి మీరు ఎందుకు వచ్చారు అని ప్రభాస్-రాజమౌళిని సూటిగా ఒక ప్రశ్న అడిగాడు.

అందుకు రాజమౌళి ఒకే ఒక్క సమాధానం ఇచ్చాడు. నువ్వు నా డార్లింగ్ నీకోసం నేను ఏదైనా చేస్తాను అంటూ రాజమౌళి చాలా సరదాగా ఆ సమాధానం ఇవ్వడంతో ప్రభాస్ కూడా చాలా ఆనంద పడిపోయాడు ఇక ప్రభాస్ అభిమానులు కూడా అందుకు సంబంధించిన వీడియోను ప్రత్యేకంగా సోషల్ మీడియాలో వైరల్ ఎలా చేస్తున్నారు. అంతే కాకుండా ప్రభాస్ రాజమౌళిని అనేక రకాల ప్రశ్నలు అడిగారు. RRR సినిమా లో తనను ఎందుకు తీసుకోలేదు అని కూడా మొహమాటం లేకుండా అనేశాడు.

కథకు అవసరం అయితే నువ్వు ఒప్పుకోక పోయినా ఏదో ఒక విధంగా ఒప్పిస్తానని రాజమౌళి చెప్పాడు. కానీ అవసరం లేదనుకుంటే మాత్రం అనవసరంగా నిన్ను తీసుకు వచ్చి పెడితే అంతగా బాగుండదు అని కూడా వివరణ ఇచ్చాడు. అందుకు ప్రభాస్ కూడా సరే అంటూ సరదాగా నవ్వుకున్నారు.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus