మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ కు రీమేక్. అయితే ఒరిజినల్ తో పోలిస్తే తెలుగులో చాలా మార్పులు చేశారు.ఆ సినిమాలో లేని సర్ప్రైజ్ లు గాడ్ ఫాదర్ లో పదికి పైనే ఉంటాయట.దర్శకుడు మోహన్ రాజా ఈ విషయాన్ని స్వయంగా చెప్పుకొచ్చాడు. అయితే మలయాళం పృథ్వీ రాజ్ సుకుమారన్ చేసిన చిన్న పాత్ర ఇక్కడ సల్మాన్ ఖాన్ చేశాడు.
ఒరిజినల్ లో ఈ పాత్రకు ఎక్కువ ప్రాముఖ్యత ఉండదు. ఆ పాత్ర నిడివి కూడా తక్కువే. అయితే తెలుగుకి వచ్చేసరికి సల్మాన్ కోసం ఆ పాత్ర నిడివి పెంచారు. అందువల్ల ఈ మూవీని హిందీలో రిలీజ్ చేసుకునే వెసులుబాటు కూడా కలిగింది. అయితే ఈ ప్రాజెక్టు లోకి సల్మాన్ ను తీసుకురావడానికి మోహన్ రాజా చిన్న స్కాం చేశాడట. ఆయన మాట్లాడుతూ…’ లూసిఫర్ లో పృథ్వీ రాజ్ సుకుమారన్ చేసిన పాత్రను తెలుగులో సల్మాన్ చేశారు.
పృథ్వీ రాజ్ అక్కడ పెద్ద స్టార్. గాడ్ ఫాదర్ కి కూడా ఒక పెద్ద స్టార్ అవసరం పడింది. అయితే ఇది గ్లామర్ కోసం కాదు. ఇందులో హీరో పాత్ర సర్వాంతర్యామి. ఎవరు ఏం గేమ్ ఆడినా… ఆయన ఆడే నాటకంలో పాత్రధారులే అంతా. అలాంటి పాత్ర కోసం చెప్పడానికి ఒక పెద్ద స్టార్ కావాలి. చిరంజీవి గారి ఇంట్లో చాలా మంచి స్టార్లు ఉన్నారు.కానీ నాకు వాళ్ళు వద్దు అనుకున్నాను. ఆ పాత్ర గురించి వాళ్ళు చెప్పడం కంటే బయటవారు చెబితేనే మరింత ఇంపాక్ట్ ఉంటుందని భావించాను.
ఇక్కడే నేను చిన్న స్కాం చేశాను. చిరంజీవి.. చరణ్ బాబు కి ఏ స్టార్ హీరోలు బెస్ట్ ఫ్రెండ్స్, వీళ్ళు అడిగితే కాదు, లేదు, చేయను అనని వాళ్ళు ఎవరా అని ఆరా తీశాను. అప్పుడు సల్మాన్ ఖాన్ గురించి తెలిసింది. చరణ్ బాబు కి చెప్పడం ఆయనే అంతా చూసుకోవడం జరిగింది. సల్మాన్ ఖాన్ స్క్రీన్ ప్రజన్స్ అదిరిపోతుంది. సల్మాన్ ఖాన్ గారు ఆయన సీన్స్ చూశారు. చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ” అంటూ మోహన్ రాజా చెప్పుకొచ్చారు