Samantha: ఆ సినిమా ప్లాప్ అవ్వడం వలనే ‘మహా సముద్రం’ నుండీ సమంత తప్పుకుందట..!

దసరా పండుగను పురస్కరించుని చాలా తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కానీ.. అన్నిటికంటే కూడా ఓ రోజు ముందుగా రిలీజ్ అవుతున్న చిత్రం ‘మహా సముద్రం’. శర్వానంద్, సిద్దార్థ్ లు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రం పై మంచి బజ్ ఉంది. రెండు పాటలు హిట్ అయ్యాయి… ట్రైలర్ కూడా కొత్తగా ఉంది. అందులో సంభాషణలు కూడా బాగున్నాయి.’ఆర్.ఎక్స్.100′ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన చిత్రం కావడం.. మల్టీ స్టారర్ లుక్ కూడా కనిపిస్తుండడంతో…

మొదటి రోజు ఈ చిత్రాన్ని చూడాలని చాలా మంది ప్రేక్షకులు ఆశ పడుతున్నారు. ఇదిలా ఉండగా… ఈ చిత్రంలో అదితి రావు హైదరి, అనూ ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్లుగా నటించారు. టైటిల్ లో మహా.. అనే పదం హీరోయిన్ పేరుని ఇండికేట్ చేస్తున్నట్టు.. చిత్ర యూనిట్ సభ్యులు వెల్లడించారు. అయితే ఆ మహా పాత్రలో ఏ హీరోయిన్ కనిపిస్తుంది అనే విషయాన్ని సీక్రెట్ గా ఉంచారు. ఇదిలా ఉండగా.. నిజానికి ఆ మహా పాత్రకి ముందుగా సమంతని సంప్రదించారట. నాగ చైతన్య, సమంత ల…

వద్దకు ముందుగా ఈ కథ వెళ్ళింది. చైతన్య చేస్తే కనుక నేను కూడా కచ్చితంగా చేస్తాను అని దర్శకుడికి సమంత చెప్పిందట. కానీ ఊహించని విధంగా చైతన్య ఈ ప్రాజెక్టు నుండీ తప్పుకుంది. తర్వాత శర్వానంద్ ఈ చిత్రంలో హీరోగా ఎంపికయ్యాడు. అయితే ఆల్రెడీ ‘జాను’ చిత్రంలో ఈ జంట కలిసి నటించింది. వీళ్ళ నటనకి మంచి మార్కులే పడ్డాయి కానీ పెయిర్ కు మాత్రం విమర్శలు వెల్లువెత్తాయి. వాటిని దృష్టిలో పెట్టుకునే సమంత ఈ ప్రాజెక్టు నుండీ తప్పుకుందని తెలుస్తుంది.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus