Tabu: టబు ఏం చేస్తోంది.. ఆఫర్స్ రావడం లేదా?

సినిమా లవర్స్ కి టబు (Tabu) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె ఒకప్పటి టాప్ హీరోయిన్, తన యాక్టింగ్‌తో గ్లామర్ తోనూ ఆడియన్స్ ని ఆకట్టుకున్న నటి. తెలుగులో నాగార్జున (Nagarjuna), చిరంజీవి (Chiranjeevi), వెంకటేశ్ (Venkatesh) వంటి స్టార్ హీరోలతో బ్లాక్‌బస్టర్ సినిమాలు చేసింది. కానీ టాలీవుడ్ నుంచి ఆమె చాలా కాలంగా దూరంగా ఉంది. చివరగా 2020లో ‘అల వైకుంఠపురములో’ (Ala Vaikunthapurramuloo) సినిమాతో మళ్లీ టాలీవుడ్ లో అడుగు పెట్టిన టబు, ఆ సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించింది.

Tabu

ఆ సినిమా సక్సెస్ అయిన తర్వాత టబు వరుసగా తెలుగులో సినిమాలు చేస్తుందని అందరూ అనుకున్నారు. అయితే, ఆ తర్వాత నాలుగేళ్లు గడిచినా టబు తెలుగు తెరపై కనిపించలేదు. దానికి రెండు కారణాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకటి, టబు బాలీవుడ్ లో బిజీగా ఉండటం. హిందీలో ఆమెకి వరుస ఆఫర్లు వస్తున్నాయి. సీరియస్ రోల్స్, బోల్డ్ క్యారెక్టర్స్, సీనియర్ వుమన్ లీడ్ గా గట్టి పాత్రలు చేస్తున్నారు. ప్రస్తుతం ‘భూత్ బంగ్లా’ అనే హిందీ సినిమాలో నటిస్తున్నారు.

ఈ మధ్యే ఆమె ‘క్రూ’ సినిమాలోనూ నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. మరొక కారణం టబుకి తెలుగు నుండి పెద్దగా ఆసక్తికరమైన ఆఫర్లు రాకపోవడమే కావచ్చు. ఏదైనా కథ నచ్చితే తప్ప టబు సినిమాలు చేయడం లేదు. బాలీవుడ్ లో ఆమె సినిమాలు చేస్తూనే వెబ్ సిరీస్ లలోనూ నటిస్తున్నారు. కానీ, టాలీవుడ్ నిర్మాతలు ఆమె వైపు చూడటం లేదా లేక ఆమెనే ఇక్కడ ఆఫర్లు తిరస్కరిస్తుందా? అనేది ఇప్పుడు చర్చగా మారింది. టబు వయస్సు 53 అయినా ఇప్పటికీ గ్లామర్, టాలెంట్ లో ఏమాత్రం తగ్గలేదు.

హిందీలో ఆమెకు బోల్డ్ రోల్స్ ఇస్తున్నారు. కానీ తెలుగులో ఆ స్థాయిలో పాత్రలు రావడం లేదని తెలుస్తోంది. టబు కూడా అలాంటి క్యారెక్టర్స్ చేయడానికి ఆసక్తి చూపుతుందా? అన్నది ప్రశ్న. ఇక ఈ ఏడాదైనా టబు తెలుగులో సినిమా చేయనుందా అని ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు. టబు కంటెంట్ బేస్డ్ సినిమాలను ఎంచుకుంటుందన్నది స్పష్టమే. ఒక వేళ పవర్‌ఫుల్ రోల్‌తో ఇక్కడ కథా వ్రాయగలిగితే టబు మళ్లీ టాలీవుడ్ కి రావడం ఖాయం.

తారక్‌ – నీల్‌ సినిమా… అన్నేళ్లు వెనక్కి వెళ్లి ఏం చూపిస్తారో?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags