Veera Simha Reddy: ‘వీరసింహారెడ్డి’ లో ఆ కాసేపు థియేటర్లు దద్దరిల్లిపోతాయంటున్నారు.?

2023 సంక్రాంతి బరిలో నటసింహ నందమూరి బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ గా విజృంభించడానికి రెడీ అవుతున్నాడు.. కేవలం బాలయ్య అభిమానులే కాదు.. తెలుగు ఇండస్ట్రీ అంతా పెద్ద పండక్కి బాక్సాఫీస్ బరిలో జాతర వాతావరణాన్ని ఎలా తలపింపజేస్తాడా అని ఆసక్తిగా ఎదురు చూస్తోంది.. రీసెంట్‌గా వదిలిన ట్రైలర్ అంచనాలు ఆకాశాన్నంటేలా చేసింది..ఇప్పటికే పది మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకెళ్తోంది.. అలాగే ఓవర్సీస్‌లో రికార్డ్ రేంజ్‌లో ప్రీమియర్ షోస్ బుకింగ్స్ జరిగాయి..

సంక్రాంతికి వస్తున్న ఇతర సినిమాలతో పోలిస్తే ఓవర్సీస్ బుకింగ్స్ విషయంలో బాలయ్య సినిమాదే పై చేయి కావడం విశేషం.. గోపిచంద్ మలినేని ఫ్యాన్ బోయ్‌గా సినిమాను తెరకెక్కించిన విధానం గురించి ఫిలింవర్గాల్లో ఆసక్తికరమైన చర్చలు నడుస్తున్నాయి.. తన అభిమాన నటుణ్ణి తెరమీద ఎలా చూపించబోతున్నాడనేది ట్రైలర్ ద్వారా శాంపిల్ చూపించాడు షాక్ ఇచ్చాడు..ట్రైలర్ విడుదలయ్యాక బాలయ్య లుక్స్, మేనరిజమ్స్ అండ్ డైలాగ్స్ గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.. సినిమా పక్కా సూపర్ హిట్ అని నందమూరి ఫ్యాన్స్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.

ముఖ్యంగా అందరూ ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్న టాపిక్ ఏంటంటే.. ఇంటర్వెల్ ఎపిసోడ్.. ట్రైలర్‌లో విదేశాల్లో ‘వీరసింహారెడ్డి’ కత్తి పట్టుకుని ప్రత్యర్థులను ఊచకోత కోస్తున్నాడు.. సీమ తగాదాలు విదేశాల వరకు ఎలా వెళ్లాయి? అనేది ఆసక్తిరేపుతున్న అంశం.. సినిమాలో ఇది ఇంటర్వలె బ్యాంగ్ అని, అదిరిపోయే ట్విస్టుతో వచ్చే ఈ ఫైట్‌కి ఫ్యాన్స్ ఎవరూ సీట్లలో కూర్చోరని.. థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్, అభిమానుల అరుపులు, కేకలతో థియేటర్లు దద్దరిల్లిపోతాయని అంటున్నారు.. ఈ యాక్షన్ ఎపిసోడ్‌ని టర్కీలో భారీ ఎత్తున చిత్రీకరించారని..

ఇక్కడి నుండి కథ కీలక మలుపు తిరుగుతుందని రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే దీని గురించి రెండు వెర్షన్స్ చెప్తున్నారు.. ఒకటి.. ‘వీరసింహారెడ్డి’ భార్యతో కలిసి కొడుకు దగ్గరకు వెళ్తాడు లేదా కొడుకు దగ్గర భార్య ఉండడంతో ఇద్దర్నీ చూడ్డానికి వెళ్తాడు.. అతనితో పాటు ఫ్యామిలీని అంతమొందించడానికి ప్రత్యర్థులు వస్తారు.. అక్కడ రెండో బాలకృష్ణను చూసి షాక్ అవుతారు.. ఆ ఫైట్‌లో ఏం జరుగుతుంది? అనేది అసలైన ట్విస్ట్.. అసలు విదేశాల వరకు ఫ్యాక్షన్ గొడవలు వెళ్లడమేంటనేది దర్శకుడు ఆసక్తికరంగా తీర్చిదిద్ది ఉంటాడు అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిస్కస్ చేసుకుంటున్నారు..

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus