Lingusamy: లింగుస్వామి కథను బన్నీ, మహేష్ అందుకే రిజెక్ట్ చేశారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు లింగుస్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. లింగుస్వామి దర్శకత్వం వహించిన ది వారియర్ మూవీ మరో 72 గంటల్లో థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుకాగా ఈ సినిమా రిజల్ట్ విషయంలో రామ్ పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ది వారియర్ సినిమాకు 30 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

రామ్ గత సినిమాలలో ఒకటైన ఇస్మార్ట్ శంకర్ 34 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించగా రెడ్ సినిమా 19 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించింది. రామ్ సినిమాకు హిట్ టాక్ వస్తే 30 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించడం కష్టం లేదు. కృతిశెట్టికి యూత్ లో ఉన్న క్రేజ్ కూడా ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. దర్శకుడు లింగుస్వామి ది వారియర్ ప్రమోషన్స్ లో భాగంగా ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు.

మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు లింగుస్వామి చెప్పిన కథలు నచ్చినా ఆ కథలు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించకపోవచ్చనే అనుమానంతో మహేష్, బన్నీ ఆ కథలను రిజెక్ట్ చేశారని సమాచారం అందుతోంది. ది వారియర్ సినిమా ఫలితం లింగుస్వామి కెరీర్ కు కీలకం కానుంది. ఈ సినిమాతో హీరో రామ్ కోలీవుడ్ ఇండస్ట్రీకి కూడా పరిచయం కానున్నారు. రామ్ ఈ సినిమా కోసం తన లుక్ ను పూర్తిస్థాయిలో మార్చుకున్నారు.

ఆది పినిశెట్టి ఈ సినిమాలో విలన్ రోల్ లో నటించగా ట్రైలర్ లో ఆది ఊరమాస్ లుక్ లో కనిపించి మెప్పించిన సంగతి తెలిసిందే. నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాను నిర్మించగా విడుదలకు ముందే ఈ సినిమా నిర్మాతలకు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందించింది. ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus