Pawan Kalyan, Ali: పవన్ తో విభేదాలపై అలీ షాకింగ్ కామెంట్స్ వైరల్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలీ మధ్య చాలా సంవత్సరాల నుంచి మంచి అనుబంధం ఉంది. పవన్ అలీ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి. పవన్ తనతో సినిమాలను తెరకెక్కించే దర్శకనిర్మాతలకు అలీ కచ్చితంగా తన సినిమాలలో ఉండాలని పలు సందర్భాల్లో సూచించినట్లు ఇండస్ట్రీలో టాక్ ఉంది. పవన్ కుటుంబానికి అత్యంత సన్నిహితులలో అలీ ఒకరు. అయితే ఈ మధ్య కాలంలో పవన్ అలీ మధ్య దూరం పెరుగుతోందని

వార్తలు జోరుగా ప్రచారంలోకి రావడంతో పాటు చాలామంది ఈ వార్తలు నిజమేనని నమ్మారు. అలీ కూతురు ఫాతిమా పెళ్లికి పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవడంతో పవన్ అలీ మధ్య గ్యాప్ పెరిగిందని కామెంట్లు వినిపించాయి. పవన్ హాజరు కాకపోవడం గురించి అలీ వివరణ ఇచ్చినా ఆ వివరణ సంతృప్తిగా లేదని కామెంట్లు వినిపించాయి. అయితే అలీతో సరదాగా చివరి ఎపిసోడ్ లో యాంకర్ సుమ అలీని ఇంటర్వ్యూ చేశారు.

ఈ ఎపిసోడ్ లో పవన్ కు అలీకి మధ్య పెరిగిన దూరం గురించి సుమ ప్రశ్నించగా అలీ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు పవన్ కు మధ్య గ్యాప్ లేదని గ్యాప్ క్రియేట్ చేశారని అలీ కామెంట్లు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఈ గ్యాప్ క్రియేట్ చేసిన వ్యక్తులకు సంబంధించి క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

వైసీపీ తరపున అలీ పదవి పొందడం వల్ల కూడా పవన్ అలీ మధ్య దూరం పెరిగిందని ఇండస్ట్రీలో టాక్ ఉంది. అలీ జనసేనలో కొనసాగి ఉంటే బాగుండేదని కొంతమంది చెబుతున్నారు. కమెడియన్ గా ఎన్నో విజయాలను అందుకున్న అలీ ప్రస్తుతం సినిమా ఆఫర్లు తగ్గినా అడపాదడపా సినిమాలతో బిజీ అవుతున్నారు. అలీతో సరదాగా షో ముగుస్తోందని తెలిసి ఈ షో ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారు.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus