Boyapati Srinu: ఆ సినిమా ఫలితం బోయపాటిని బాధ పెట్టిందా?

సింహా, లెజెండ్ సినిమాల తర్వాత బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ కావడంతో అఖండ మూవీపై ఊహించని స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమాను థమన్, పూర్ణ, ప్రగ్య జైస్వాల్ ప్రమోట్ చేస్తుండగా బోయపాటి శ్రీను మాత్రం ఇంటర్వ్యూలు ఇవ్వడం లేదు. బోయపాటి శ్రీను సైలెన్స్ కు కారణం వినయ విధేయ రామ సినిమా ఫలితం అని తెలుస్తోంది. అఖండ సినిమా రిలిజైన తర్వాత బోయపాటి శ్రీను మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వాలని భావిస్తున్నట్టు బోగట్టా.

వినయ విధేయ రామ సినిమాకు ఎంతో కష్టపడి బోయపాటి ప్రమోషన్స్ చేశారు. అయితే బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా డిజాస్టర్ కావడంతో పాటు బోయపాటి శ్రీను దర్శకత్వం విషయంలో చేసిన చిన్నచిన్న తప్పులే ఆ సినిమా ఫ్లాప్ కావడానికి కారణమయ్యాయనే కామెంట్లు జోరుగా వినిపించాయి. కొంతమంది నెటిజన్లు బోయపాటి శ్రీను చెప్పిన మాటలను వినయ విధేయ రామకు ఫ్లాప్ టాక్ వచ్చిన తర్వాత తీవ్రస్థాయిలో ట్రోల్ చేశారు. అయితే అఖండ సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

బాక్సాఫీస్ వద్ద అఖండ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమా అంచనాలను మించి సక్సెస్ సాధిస్తుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. బాలకృష్ణకు జోడీగా ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాలో నటించగా పూర్ణ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. శ్రీకాంత్ అఖండలో విలన్ పాత్రలో నటిస్తుండగా శ్రీకాంత్ అభిమానులు సైతం ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ బిజీ అవుతారని భావిస్తున్నారు.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus