షణ్ముఖ్ సిరి మధ్య గ్యాప్ కు అసలు కారణం ఇదేనా?

బిగ్ బాస్ షో సీజన్5 ద్వారా షణ్ముఖ్ సిరి జోడీ పాపులర్ అయింది. ఈ షో వల్ల షణ్ముఖ్ వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. షణ్ముఖ్ దీప్తి సునైనా మధ్య గ్యాప్ పెరగడంతో పాటు వాళ్లిద్దరూ మళ్లీ కలిసే పరిస్థితులు సైతం కనిపించడం లేదు. అయితే షణ్ముఖ్, సిరి ఈ మధ్య కాలంలో కలిసి ఎక్కడా కనిపించలేదు. షణ్ముఖ్ కు దూరంగా ఉండటానికే సిరి ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం. అయితే ఈ విధంగా చేయడం గురించి సిరి చెబుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

షణ్ముఖ్ కు కావాలని దూరంగా ఉండటం లేదని షణ్ముఖ్ వ్యక్తిగత జీవితంలో ఆ విధంగా జరుగుతుందని నేను అనుకోలేదని సిరి కామెంట్లు చేశారు. షణ్ముఖ్ దీప్తి బ్రేకప్ జరిగిన తర్వాత మా ఇద్దరి మధ్య కాంటాక్ట్ ఉండటం సరికాదని అనిపించిందని సిరి చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మేమిద్దరం కెరీర్ పరంగా బిజీ అయ్యామని ఆమె తెలిపారు. నేను, షణ్ముఖ్ ఎక్కడ ఉన్నా ఒకరి బాగు గురించి మరొకరు ఆలోచించడం జరుగుతుందని సిరి చెప్పుకొచ్చారు.

సిరి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. షణ్ముఖ్ సైతం ఇంటర్వ్యూలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. వెబ్ సిరీస్ లలో కూడా షణ్ముఖ్ ఎక్కువగా నటించడం లేదు. షణ్ముఖ్ కు సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. షణ్ముఖ్, సిరి మధ్య గ్యాప్ ఎప్పటికి తగ్గుతుందో చూడాల్సి ఉంది. షణ్ముఖ్, దీప్తి సునైనా కలిస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

బిగ్ బాస్ షోలో షణ్ముఖ్ రన్నర్ గా నిలవడంలో దీప్తి సునైనా పాత్ర ఎంతో ఉంది. దీప్తి సునైనా పాత జ్ఞాపకాలను మరిచి కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. బిగ్ బాస్ షోలో మళ్లీ ఛాన్స్ వస్తే షణ్ముఖ్ లేదా దీప్తి సునైనా పాల్గొంటారో లేదో చూడాలి. షణ్ముఖ్ వ్యక్తిగత జీవితానికి మాత్రం బిగ్ బాస్ షో వల్ల భారీ స్థాయిలో నష్టం చేకూరుతోంది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus