Jr NTR: టైగర్3 మూవీలో తారక్ పేరు వినిపించడానికి కారణాలివేనా?

మరికొన్ని గంటల్లో థియేటర్లలో విడుదల కానున్న టైగర్3 సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. హైదరాబాద్ లో టైగర్3 తెలుగు వెర్షన్ కంటే హిందీ వెర్షన్ బుకింగ్స్ బాగున్నాయి. టైగర్3 మూవీలో తారక్ కనిపిస్తారని వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. లియో సినిమాలో చరణ్ కనిపిస్తారని ఏ విధంగా ప్రచారం జరిగిందో టైగర్3 సినిమాలో తారక్ కనిపిస్తారని అదే విధంగా ప్రచారం జరిగింది. కేవలం పబ్లిసిటీ కోసమే టైగర్3 మూవీలో తారక్ పేరు వినిపించిందని తెలుస్తోంది.

టైగర్3 మూవీపై భారీగానే అంచనాలు నెలకొన్నా ముంబైలో సైతం ఈ సినిమా బుకింగ్స్ ఆశాజనకంగా లేవు. టైగర్3 సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రమే ఈ పరిస్థితి మారే ఛాన్స్ ఉంది. టైగర్3 మూవీ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది. టైగర్3 మూవీ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. కత్రినా కైఫ్ కెరీర్ కు సైతం ఈ సినిమా కీలకం కానుంది.

300 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం. అదిరిపోయే యాక్షన్ సీన్లతో పాటు ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ కు ప్రాధాన్యత ఉండనుందని సమాచారం అందుతోంది. సల్మాన్ ఖాన్ గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది. టైగర్3 సినిమా సక్సెస్ సాధిస్తే టైగర్3 సినిమాకు సీక్వెల్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో వార్2 సినిమా కూడా తెరకెక్కుతుండగా ఈ సినిమాపై కూడా అంచనాలు పెరుగుతున్నాయి. 2025 సంవత్సరంలో ఈ సినిమా రిలీజ్ కానుంది. వార్2 సినిమాలో (Jr NTR) యంగ్ టైగర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus