Jr NTR Letter: ఎన్టీఆర్ లెటర్ వెనుక ఇంత అర్థం ఉందా?

ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ మొదలుకావడానికి ముందే చరణ్ ఎన్టీఆర్ మంచి స్నేహితులు అనే సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ సమయంలో వీళ్లిద్దరి మధ్య స్నేహం మరింత బలపడింది. రాజమౌళి ఈ ఇద్దరు హీరోలకు ఆర్ఆర్ఆర్ లాంటి అద్భుతమైన కథ చెప్పి మెప్పించారు. ఫ్యాన్స్ నుంచి సమస్యలు ఉంటాయని తెలిసినా జక్కన్న ఆర్ఆర్ఆర్ లో ఇద్దరు హీరోలకు దాదాపుగా సమ ప్రాధాన్యత ఇచ్చి సినిమాను రిలీజ్ చేశారు. ఆర్ఆర్ఆర్ రిలీజ్ తర్వాత తమ హీరోకు సినిమాలో ప్రాధాన్యత తక్కువైందని ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.

Click Here To Watch NOW

ముఖ్యంగా ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ లో స్క్రీన్ స్పేస్ విషయంలో హర్ట్ అయ్యారని సోషల్ మీడియా, వెబ్ మీడియాలో ప్రచారం జరిగింది. విడుదలకు ముందు హడావిడి చేసిన ఎన్టీఆర్ సినిమా రిలీజ్ తర్వాత సైలెంట్ కావడంతో కొంతమంది ఈ వార్తలను నిజమేనని నమ్మారు. అయితే ట్విట్టర్ లో పోస్ట్ చేసిన లెటర్ ద్వారా ఆర్ఆర్ఆర్ రిజల్ట్ విషయంలో తాను హ్యాపీ అని ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చేశారు. అదే సమయంలో భీమ్ లేకపోతే రామ్ లేడు అంటూ అల్లూరి సీతారామరాజు పాత్రకు చరణ్ పూర్తిస్థాయిలో న్యాయం చేశాడంటూ ఎన్టీఆర్ తెగ మెచ్చుకున్నారు.

రామ్ పాత్ర లేకపోతే భీమ్ పాత్ర అద్భుతంగా వచ్చేది కాదేమోనని తారక్ వెల్లడించారు. సినిమాకు పని చేసిన అందరికీ తారక్ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఆర్ఆర్ఆర్ తన కెరీర్ లో ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచిందని తారక్ చెప్పుకొచ్చారు. ఆర్ఆర్ఆర్ మూవీలో తన రోల్ విషయంలో తాను సంతృప్తితోనే ఉన్నానని తారక్ చెప్పకనే చెప్పేశారు. ఆర్ఆర్ఆర్ మూవీతో ఎన్టీఆర్ కు పాన్ ఇండియా ఇమేజ్ దక్కింది.

ఎన్టీఆర్ లెటర్ తో ఫ్యాన్స్ కూల్ అవుతారేమో చూడాల్సి ఉంది. సినిమాసినిమాకు తారక్ కు క్రేజ్, మార్కెట్ అంతకంతకూ పెరుగుతోంది. తారక్ భవిష్యత్తు ప్రాజెక్టులు కూడా పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కనున్నాయి.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus