రజనీకాంత్ (Rajinikanth) శంకర్ (Shankar) కాంబినేషన్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అనే సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన శివాజీ (Sivaji) , రోబో(Robo) , 2.ఓ (Robo 2.0) సినిమాలు ప్రేక్షకులను అంచనాలను మించి మెప్పించాయి. భవిష్యత్తులో ఈ కాంబినేషన్ రిపీట్ అయ్యే అవకాశాలు సైతం ఉన్నాయని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమయ్యాయి. అయితే రోబో సినిమాలో మొదట నాకే ఛాన్స్ వచ్చిందని అయితే కొన్ని కారణాల వల్ల నటించలేదని కమల్ హాసన్ పేర్కొన్నారు. రోబో సినిమా కోసం శంకర్ నన్ను సంప్రదించిన సమయంలో కొన్నాళ్ల పాటు హీరోగా ఉండాలని అనుకుంటున్నానని నవ్వుతూ సమాధానం ఇచ్చానని కమల్ హాసన్ చెప్పుకొచ్చారు.
ఐ రోబో అనే ఇంగ్లీష్ నవలను తెరకెక్కిస్తే బాగుంటుందని నేను, శంకర్ 1990 లలో అనుకున్నామని ఆయన తెలిపారు. హీరో రోల్ కు సంబంధించిన లుక్ టెస్ట్ కూడా పూర్తి చేశామని కమల్ హాసన్ కామెంట్లు చేశారు. కానీ కొన్ని రీజన్స్ వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదని కమల్ హాసన్ వెల్లడించారు. సినిమా ఇండస్ట్రీలో పారితోషికం, డేట్స్, ఇలా ఎన్నో లెక్కలు ఉంటాయని అప్పటి మార్కెట్ ప్రకారం ఆ మూవీ చేయకపోవడమే మంచిదని ఫీలయ్యానని కమల్ హాసన్ (Kamal Haasan) తెలిపారు.
అందుకే నేను వెనుకడుగు వేశానని నా ఫ్రెండ్ శంకర్ మాత్రం ఆ సినిమాను వదల్లేదని సరైన సమయంలో ఆ సినిమాను రూపొందించి బ్లాక్ బస్టర్ అందుకున్నారని కమల్ హాసన్ వెల్లడించారు. మరికొన్ని రోజుల్లో కమల్ హాసన్ భారతీయుడు2 (Indian 2) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.
జులై 12వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. సిద్దార్థ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. కల్కితో హిట్ అందుకున్న కమల్ భారతీయుడు2 సినిమాతో మ్యాజిక్ చేస్తారేమో చూడాల్సి ఉంది.