ఇంద్రగంటి సినిమాలు ఫ్లాప్ కావడానికి కారణమిదేనా?

సుధీర్ బాబు, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా తాజాగా థియేటర్లలో విడుదలైంది. మిగతా సినిమాలతో పోలిస్తే బెటర్ టాక్ వచ్చినా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా అయితే కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో నటించాలని ఇద్దరు హీరోలు భావించారు. అయితే సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించని నేపథ్యంలో ఇంద్రగంటికి కొత్త సినిమా ఆఫర్లు రావడం కష్టమేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

టాలీవుడ్ హీరోలలో ఒకరైన నాగచైతన్య గత రెండు సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి ఫ్లాప్ అయ్యాయనే సంగతి తెలిసిందే. ఈ హీరో ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించాల్సి ఉందని సమాచారం. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి రిజల్ట్ నేపథ్యంలో నాగచైతన్య ఏం చేస్తారో చూడాల్సి ఉంది. మరో హీరో విజయ్ దేవరకొండ కూడా ఇంద్రగంటి డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించడానికి ఆసక్తి చూపించారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

దిల్ రాజు నిర్మాతగా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కే ఛాన్స్ అయితే ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరిగింది. లైగర్ ఫ్లాప్ తో ఢీలా పడిన విజయ్ దేవరకొండ తర్వాత ప్రాజెక్ట్ లతో సక్సెస్ లను అందుకోవాలని భావిస్తున్నారు. ఈ హీరో కూడా ఇంద్రగంటి మోహనకృష్ణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ అయితే లేదు. ఇంద్రగంటి మోహనకృష్ణ మళ్లీ ప్రూవ్ చేసుకుంటే మాత్రమే ఆయనకు కొత్త ఆఫర్లు వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

ఇంద్రగంటి మోహనకృష్ణ పరిమిత బడ్జెట్ తో సినిమాను తెరకెక్కించి సక్సెస్ ట్రాక్ లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇంద్రగంటి మోహనకృష్ణకు ఛాన్స్ ఇచ్చే నిర్మాత ఎవరనే ప్రశ్నకు సైతం సమాధానం దొరకాల్సి ఉంది. క్లాస్ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ తీయడం వల్లే ఇంద్రగంటి సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus