Nagarjuna: నాగ్ మాటల వెనుక అసలు కథ ఇదేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా ఉండే హీరోలలో నాగార్జున ఒకరనే సంగతి తెలిసిందే. ఒకవైపు హీరోగా కెరీర్ ను కొనసాగిస్తూనే నిర్మాతగా, వ్యాపారవేత్తగా నాగార్జున రాణిస్తున్నారు. తాజాగా నాగార్జున ఏపీలో తగ్గించిన టికెట్ రేట్ల గురించి స్పందించనని సినిమా వేదికలపై రాజకీయాలు వద్దు అని అన్నారు. అయితే నాగార్జున స్టేట్ మెంట్ కొందరు హీరోలకు, నిర్మాతలకు ఆగ్రహం తెప్పించిందని తెలుస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఒక స్టార్ హీరో అభిమానులు నాగ్ చేసిన కామెంట్ల వల్ల బాగా హర్ట్ అయ్యారు.

నాగార్జున స్పందించి టికెట్ రేట్లను పెంచమని కోరి ఉంటే బాగుండేదనే కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి. అదే సమయంలో నాగార్జున టికెట్ రేట్లపై కామెంట్లు చేయకపోవడానికి అసలు కారణం వేరే ఉందని సమాచారం. హీరో నాగార్జున కొన్నిరోజుల క్రితం సీఎం జగన్ ను కలిసిన సంగతి తెలిసిందే. జగన్ నుంచి టికెట్ రేట్లకు సంబంధించి నాగార్జునకు క్లారిటీ ఉందని బోగట్టా. శ్యామ్ సింగరాయ్ రిలీజ్ సమయంలో నాని చేసిన కామెంట్ల వల్ల ఆ సినిమాకు ఊహించని స్థాయిలో డ్యామేజ్ జరిగింది.

బంగార్రాజు సినిమా రిలీజ్ సమయంలో నాగార్జున నాని చేసిన తప్పును రిపీట్ చేయాలని అనుకోవడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలతో వివాదం స్టార్ హీరోలకు మంచిది కాదు. టికెట్ రేట్ల సమస్య వల్ల బంగార్రాజును వాయిదా వేసే పరిస్థితి కూడా లేదు. ఈ రీజన్స్ వల్లే నాగార్జున టికెట్ రేట్ల విషయంలో వివాదాస్పద కామెంట్లు చేయలేదని నెటిజన్లు భావిస్తున్నారు. ఏపీ ప్రభుత్వానికి నాగార్జున భయపడ్డారని కొంతమంది కామెంట్లు చేస్తున్నా నాగ్ మాత్రం తెలివిగా వ్యవహరించారని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

బంగార్రాజు నాగ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 50 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన బంగార్రాజు రికార్డు స్థాయిలో థియేటర్లలో రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus