స్టార్ హీరో అక్కినేని నాగార్జున ఇప్పటివరకు 99 సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే. నాగార్జున 100వ సినిమా ఏమిటనే ప్రశ్నకు మోహన్ రాజా డైరెక్షన్ లో తెరకెక్కే సినిమా అని సమాధానంగా వినిపిస్తోంది. అయితే మోహన్ రాజా చిరంజీవితో తెరకెక్కించిన గాడ్ ఫాదర్ కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.పలు ఏరియాలలో ఈ సినిమాకు నష్టాలు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అయినప్పటికీ మోహన్ రాజా టాలెంటెడ్ డైరెక్టర్ కావడంతో ఆయనకు ఛాన్స్ ఇవ్వాలని మరి కొందరు సూచిస్తున్నారు.
అయితే ఇక్కడో సమస్య ఉంది. నాగార్జున పలు సినిమాలలో గెస్ట్ రోల్స్ లో నటించిన నేపథ్యంలో ఆ సినిమాలను కూడా లెక్కిస్తే మాత్రమే తర్వాత సినిమా వందో మూవీ అవుతుంది. ఆ సినిమాలను లెక్కించని పక్షంలో ఈ సినిమా వందో సినిమా కాదు. అందువల్ల నాగార్జున మోహన్ రాజా సినిమా షూట్ పూర్తైన తర్వాతే ఈ సినిమాను వందో సినిమాగా ప్రకటించాలో లేదో నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో చిరంజీవి 150 కంటే ఎక్కువ సినిమాలలో నటించగా బాలయ్య ప్రస్తుతం 107వ సినిమాలో నటిస్తున్నారు.
నాగార్జున 100వ సినిమా షూట్ త్వరలో మొదలుకానున్న నేపథ్యంలో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ మాత్రం ఈ మార్కును అందుకోవాలంటే మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. యంగ్ జనరేషన్ స్టార్ హీరోలు మాత్రం ఈ మార్కును అందుకోవడం ప్రస్తుతం సులువు కాదనే సంగతి తెలిసిందే. యంగ్ జనరేషన్ హీరోలు తమ కెరీర్ లో 50 కంటే ఎక్కువ సినిమాలలో నటించడం కూడా కష్టమని కామెంట్లు వినిపిస్తున్నాయి.
టాలీవుడ్ యంగ్ జనరేషన్ హీరోలు రెండేళ్లకు ఒక సినిమాలో నటిస్తుండటం ఇందుకు కారణమని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. నాగార్జున తర్వాత సినిమా ఎలాంటి కథతో తెరకెక్కనుందో చూడాల్సి ఉంది.
Most Recommended Video
ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!