Mahesh Babu, Jr NTR: టాలీవుడ్ హీరోలను నెట్ ఫ్లిక్స్ సీఈవో కలవడం వెనుక కారణాలివేనా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా రిలీజ్ కు కేవలం 5 వారాల సమయం మాత్రమే ఉంది. ఈ నెలాఖరు నాటికి గుంటూరు కారం సినిమా షూటింగ్ ను పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టాలని ఈ సినిమా మేకర్స్ భావిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ను, సూపర్ స్టార్ మహేష్ బాబును నెట్ ఫ్లిక్స్ సీఈవో కలవడం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.

మొన్న మెగా ఫ్యామిలీని, నిన్న నందమూరి హీరోలను కలిసిన నెట్ ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరండోస్ ఈరోజు మహేష్ బాబును కలిసి ఆశ్చర్యపరిచారు. జూనియర్ ఎన్టీఆర్ ఫేస్ బుక్ వేదికగా నెట్ ఫ్లిక్స్ సీఈవోలను కలిసిన ఫోటోలను షేర్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గుంటూరు కారం మూవీ సెట్స్ లో మహేష్ ను నెట్ ఫ్లిక్స్ సీఈవో కలిశారని సమాచారం అందుతోంది. నెట్ ఫ్లిక్స్ సీఈవో మరి కొందరు స్టార్ హీరోలను సైతం కలిసే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది.

నెట్ ఫ్లిక్స్ ఇప్పటికే వరుసగా తెలుగు క్రేజీ సినిమాల హక్కులను కొనుగోలు చేస్తోంది. గుంటూరు కారం సినిమా డిజిటల్ హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతమయ్యాయి. దేవర డిజిటల్ హక్కులు సైతం ఈ ఓటీటీ సొంతమయ్యాయని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. నెట్ ఫ్లిక్స్ టాలీవుడ్ స్టార్ హీరోలతో టాక్ షో లేదా వెబ్ సిరీస్ ప్లాన్ చేసే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది.

ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్ సంస్థకు సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొంటే టాలీవుడ్ హీరోల ఇమేజ్ మరింత పెరిగే అవకాశాలు ఉంటాయి. త్వరలో నెట్ ఫ్లిక్స్ సీఈవో టాలీవుడ్ హీరోలను కలవడానికి గల కారణాలు వెల్లడయ్యే చాన్స్ ఉంది. మొదట ఆర్.ఆర్.ఆర్ హీరోలను కలిసిన టెడ్ సరండోస్ (Mahesh Babu) మహేష్ తో కూడా భేటీ కావడంతో ప్రభాస్, పవన్, బన్నీలను కూడా నెట్ ఫ్లిక్స్ సీఈవో కలిస్తే బాగుంటుందని ఆయా హీరోల ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus