అక్కినేని నాగార్జున తనయుడు నాగచైతన్య జోష్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందే. వాసువర్మ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కగా భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. కథ, కథనం బాగానే ఉన్నా చిన్నచిన్న పొరపాట్లు ఈ సినిమా ఫ్లాప్ కావడానికి కారణాలయ్యాయి. అక్కినేని వారసుడు నాగచైతన్య కెరీర్ కు జోష్ మూవీ ఏ మాత్రం ప్లస్ కాలేదు. ఈ సినిమాకు దిల్ రాజు ప్రొడ్యూసర్ కాగా నిర్మాతగా దిల్ రాజుకు ఈ సినిమా నష్టాలను మిగిల్చిందనే సంగతి తెలిసిందే.
Click Here To Watch NEW Trailer
తాజాగా దిల్ రాజు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జోష్ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. మున్నా షూటింగ్ సమయంలోనే బన్నీ అరగంట కథ విని పరుగు సినిమాకు ఓకే చెప్పారని దిల్ రాజు అన్నారు. నాగచైతన్యను కొత్తబంగారులోకంతో లాంఛ్ చేయాలని చైతన్యకు కథ చెప్పామని దిల్ రాజు వెల్లడించారు. నాగార్జున కొత్త బంగారు లోకం వద్దని కమర్షియల్ అంశాలు ఉన్న సినిమా కావాలని చెప్పడంతో వాసువర్మకు తాను అదే విషయం చెప్పగా వాసువర్మ జోష్ కథ చెప్పాడని దిల్ రాజు చెప్పుకొచ్చారు.
అయితే జోష్ కథను మొదట రామ్ చరణ్ కు చెప్పామని చరణ్ కు ఆ కథ నచ్చిందని చిరంజీవి గారికి కథ చెబితే ఆయన ఈ కథలో తనకు చాలా ప్రశ్నలు ఉన్నాయని చెప్పారని నాగబాబు కూడా కథ విని అదే అభిప్రాయం వ్యక్తం చేశారని దిల్ రాజు పేర్కొన్నారు. చిరంజీవి జోష్ కథ విషయంలో సంతృప్తి లేదని చరణ్ కు ఆ కథ కరెక్ట్ కాదని చెప్పారని దిల్ రాజు వెల్లడించారు. ఆ తర్వాత నాగార్జునకు కథ చెప్పగా కథ నచ్చిందని అలా చైతన్యను జోష్ మూవీతో లాంఛ్ చేశామని దిల్ రాజు తెలిపారు.
జోష్ రిలీజ్ సమయంలో వైఎస్సార్ గారు చనిపోవడంతో సినిమాపై ప్రభావం పడిందని దిల్ రాజు అన్నారు. ఫైనాన్షియర్స్ కు భరోసా ఇచ్చి జోష్ సినిమాను రిలీజ్ చేశామని దిల్ రాజు వెల్లడించారు. జోష్ ఫలితాన్ని చిరంజీవి ముందే ఊహించారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!