Rj Chaitu: మూడోవారం ఆర్జే చైతూ వెళ్లిపోవడానికి కారణం ఆమేనా?

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో అనూహ్యంగా మూడోవారం చైతూ ఎలిమినేట్ అయిపోయాడు. నిజానికి ఎలిమినేషన్ ప్రక్రియాలో చైతూతో పాటు లాస్ట్ వరకూ ఉన్న స్రవంతి చాలా టెన్షన్ పడింది. హౌస్ మేట్స్ అందరూ కూడా స్రవంతి ఎలిమినేట్ అయిపోతుందని అనుకున్నారు. కానీ చైతూ ఎలిమినేట్ అయ్యేసరికి ఒక్కసారిగా షాక్ తిన్నారు. అషూరెడ్డి, అఖిల్ బయటకి కంటెంట్ ఎలా వెళ్తుంది అనేదానిపైన డిస్కషన్ పెట్టారు. బిందుమాధవి అయితే దుప్పటి కప్పుకుని మరీ ఏడ్చింది.

Click Here To Watch NEW Trailer

చైతూ ఎలిమినేషన్ అనేది హౌస్ మేట్స్ కి మింగుడు పడలేదు. అయితే, చైతూ వెళ్లిపోయేటపుడు మిత్రాశర్మా చైతూని గట్టిగా పట్టుకుని సారీ చెప్పింది. మిత్రాశర్మా చైతూని నామినేట్ చేసేటపుడు హై డ్రామా చేసింది. తన వల్లే చైతూ వెళ్లిపోవాల్సి వచ్చిందని నిజంగా ఐ యామ్ వెరీ సారీ అంటూ చైతూకి చెప్పింది. అంతేకాదు, మిత్రాశర్మా చైతూని నామినేట్ చేసేటపుడు ఇద్దరి మద్యలో గట్టి ఆర్గ్యూమెంట్ అయ్యింది. వీరిద్దరూ మాటకి మాట చెప్పుకున్నారు.

ఆ తర్వాత వారం అంతా కూడా పెద్దగా ఇద్దరి మద్యలో బాండింగ్ అనేది లేదు. అయితే, చైతూ ఎలిమినేట్ అయ్యేటపుడు మాత్రం మిత్రాశర్మా చాలా ఫీల్ అయ్యింది. తన వల్లే చైతూ వెళ్లిపోయాడని బాగా ఎమోషనల్ అయ్యింది. మొదటివారం నుంచీ ఆర్జే చైతూ ప్రతి విషయంలోనూ లాజిక్స్ వర్కౌట్ చేయడానికి ట్రై చేశాడు. ముఖ్యంగా ఫుడ్ విషయంలో అఖిల్ తో గొడవ జరగడం అనేది చైతూకి మైనస్ అయ్యింది. ఆ తర్వాత కూడా అఖిల్ తో టఫ్ ఫైట్ అనేది జరిగింది.

నామినేషన్స్ అప్పుడు కూడా అఖిల్ చెప్పిన రీజన్ నచ్చక చైతూ ఆవేశపడ్డాడు. ఇద్దరూ మాటకి మాట అనుకున్నారు. ఇక కెప్టెన్ అయినా కూడా చైతూ వెళ్లిపోవడం అనేది హౌస్ మేట్స్ ని షాక్ కి గురి చేసింది.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus