RRR Movie: ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ అందుకే మొదలుకాలేదా?

రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాకు గతేడాది డిసెంబర్ నెలలో మేకర్స్ భారీస్థాయిలో ప్రమోషన్స్ చేశారు. అయితే అదే సమయంలో ఒమిక్రాన్ కేసులు పెరగడంతో ఆర్ఆర్ఆర్ మూవీని వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఆర్ఆర్ఆర్ ఈ ఏడాది మార్చి నెల 25వ తేదీన రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు సైతం పూర్తయ్యాయని తెలుస్తోంది. ఈ సినిమా రిలీజ్ కు కేవలం ఐదు వారాల సమయం మాత్రమే ఉన్నప్పటికీ ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను మేకర్స్ మొదలుపెట్టలేదు.

Click Here To Watch

ఆర్ఆర్ఆర్ టీం సైలెన్స్ వెనుక అసలు కారణం వేరే ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ పై ఊహించని స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ సైతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ప్రమోషన్స్ చేసినా చేయకపోయినా కలెక్షన్ల విషయంలో మార్పు ఉండదు. అందువల్ల మార్చి నెల మొదటివారం నుంచి ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ ను మొదలుపెట్టాలని మేకర్స్ అనుకుంటున్నారు. మార్చి 25వ తేదీన ఆర్ఆర్ఆర్ రిలీజయ్యే విషయంలో దాదాపుగా మార్పు లేదు.

ఈ సినిమాకు ముందూవెనుక తమ సినిమాలను రిలీజ్ చేయడానికి మేకర్స్ సైతం ఆలోచిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ రిలీజైన తర్వాత మూడు వారాల పాటు మరే పెద్ద సినిమా నుంచి పోటీ లేదు. భీమ్లా నాయక్ మూవీ ఫిబ్రవరి 25వ తేదీకే ఫిక్స్ కావడం ఆర్ఆర్ఆర్ కు కలిసొచ్చింది. ఆర్ఆర్ఆర్ కు ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా పెద్దగా పోటీ లేదు. ఆర్ఆర్ఆర్ రిలీజయ్యే సమయానికి ఏపీలో టికెట్ రేట్లు కూడా పెరగడం గ్యారంటీ అని చెప్పవచ్చు.

ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద భారీ బ్లస్టర్ హిట్ గా నిలుస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus