స్టార్ హీరోయిన్ సమంత నటించిన యశోద సినిమా మరో రెండు రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది. 40 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమా థియేట్రికల్ హక్కులు 24 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. శాటిలైట్, డిజిటల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడవగా థియేట్రికల్ హక్కుల ద్వారా సమంత సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. సమంత మార్కెట్ ను ఒక విధంగా యశోద డిసైడ్ చేయనుందని చెప్పవచ్చు.
తెలుగు రాష్ట్రాల్లో సమంతకు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా విడుదలవుతోంది. సమంత అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కనీసం 25 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంటే మాత్రమే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే సమంత సినిమాకు ఈ స్థాయిలో కలెక్షన్లు రావడం సాధ్యమేనా అనే ప్రశ్నలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
సమంత హెల్త్ బాలేకపోయినా కష్టపడి ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనగా సమంత కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సమంత రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా ఈ సినిమా ఇతర భాషల్లో ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాల్సి ఉంది. సాధారణంగా నవంబర్ నెలలో విడుదలైన పెద్ద సినిమాలు సక్సెస్ సాధించే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
అయితే ఈ సినిమా ఆ సెంటిమెంట్ ను కచ్చితంగా బ్రేక్ చేస్తుందని ఇండస్ట్రీలో టాక్ ఉంది. సమంత ఈ సినిమాకు 3 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను తీసుకున్నారు. ఈ సినిమాలోని ఎక్కువ సన్నివేశాలను సెట్స్ లో షూట్ చేశారు. ఈ రీజన్ వల్లే ఈ సినిమాకు ఊహించని స్థాయిలో బడ్జెట్ పెరిగింది.