ఆ రీజన్ వల్లే సంక్రాంతి డైరెక్టర్లు సైలెంట్ అయ్యారా?

ఈ ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి నిర్మాతలకు మంచి లాభాలను అందించిన సంగతి తెలిసిందే. అయితే బాబీ, గోపీచంద్ మలినేని తమ సినిమాలతో విజయం సాధించినా ఈ డైరెక్టర్ల కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన ప్రకటనలేవీ వెలువడలేదు. ఈ డైరెక్టర్లు ప్రస్తుతం స్క్రిప్ట్ లను సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. ఈ డైరెక్టర్లకు హీరోల నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉందని సమాచారం అందుతోంది.

ఈ డైరెక్టర్లు క్రేజ్ ఉన్న స్టార్ హీరోల సినిమాలకు డైరెక్టర్లుగా వ్యవహరించాలని భావిస్తున్నా ఆ హీరోలు వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సంక్రాంతి డైరెక్టర్లకు ఏ హీరోలు ఓకే చెబుతారో చూడాల్సి ఉంది. ఏ హీరోలు ఈ దర్శకులకు ఛాన్స్ ఇస్తారో చూడాల్సి ఉంది. బాబీ, గోపీచంద్ మలినేని పారితోషికం ఊహించని రేంజ్ లో ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

బాబీ, గోపీచంద్ మలినేని రేంజ్ ను మరింత పెంచే సినిమాలను తెరకెక్కించాలని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం. బాబీ, గోపీచంద్ మలినేని తమ సంక్రాంతి హీరోలను మార్చుకుంటారని వినిపిస్తున్నా అధికారిక ప్రకటనలు వచ్చే వరకు ఆగాల్సిందేనని చెప్పవచ్చు. బాబీ, గోపీచంద్ మలినేని టాలెంటెడ్ డైరెక్టర్లు కాగా మాస్ సినిమాల ద్వారా ఈ డైరెక్టర్లు కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ఇద్దరు దర్శకులు తమ సినిమాలలో కామెడీకి ప్రాధాన్యత ఇస్తున్నారు.

టాలీవుడ్ స్టార్ హీరోలు వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా డైరెక్టర్లు మాత్రం వేగంగా సినిమాలను తెరకెక్కించడం లేదు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ క్రేజ్ మరింత పెంచుకుని రికార్డులు తిరగరాయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. గోపీచంద్ మలినేని, బాబీ దాదాపుగా ఒకే సమయంలో దర్శకులుగా కెరీర్ ను మొదలుపెట్టారనే సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు దర్శకులతో సినిమాలు చేయడానికి చాలామంది నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus