Sri Rama Rajyam: బాలయ్య శ్రీరామరాజ్యం మూవీ ట్రెండింగ్ లో ఉండటానికి కారణాలివే!

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ రాముని పాత్రలో నటించిన ఆదిపురుష్ మూవీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సంగతి తెలిసిందే. కొంతమంది ఈ సినిమాపై నెగిటివ్ కామెంట్లు చేస్తుండగా ఎక్కువమంది పాజిటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఆదిపురుష్ సినిమాలో తప్పులు మాత్రం ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఆదిపురుష్ ఫుల్ రన్ లో కొంతమేర నష్టాలను మిగిల్చే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు. మరోవైపు శ్రీరామరాజ్యం మూవీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.

ఈతరం ప్రేక్షకులు శ్రీరామ రాజ్యం సినిమా చూస్తే ఆదిపురుష్ కంటే బెటర్ గా అర్థమవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం విడుదలైన శ్రీరామరాజ్యం మూవీ అప్పట్లో చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. శ్రీరామరాజ్యం మూవీ బాలకృష్ణకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో సీత పాత్రలో నయనతార నటించగా తన పాత్రకు ఆమె పూర్తి స్థాయిలో న్యాయం చేశారు. శ్రీరామరాజ్యం సినిమాకు దర్శకుడు బాపు దర్శకత్వం వహించారు.

శ్రీరామరాజ్యం (Sri Rama Rajyam) సినిమా భక్తి సినిమాలను అభిమానించే అభిమానులకు ఎంతగానో నచ్చింది. శ్రీరామరాజ్యం, ఆదిపురుష్ రామాయణం ఆధారంగా తెరకెక్కడంతో ఈ సినిమా గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. మరోవైపు ఆదిపురుష్ తెలుగు వెర్షన్ ఎక్కువ మొత్తం కలెక్షన్లను సొంతం చేసుకుంటోంది. ఇతర భాషల వెర్షన్లు మాత్రం మరీ భారీగా కలెక్షన్లు అయితే సాధించడం లేదు. ఆదిపురుష్ రికార్డులు క్రియేట్ చేయడం కష్టమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఆదిపురుష్ ఫుల్ రన్ కలెక్షన్లు మరీ భారీ రేంజ్ లో ఉంటాయో లేదో చూడాల్సి ఉంది. ఆదిపురుష్ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నా మైనస్ ల వల్ల ఈ సినిమాపై ఎఫెక్ట్ పడుతోంది. ప్రభాస్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారని సమాచారం అందుతోంది. కాలికి సర్జరీ చేయించుకుని కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని ప్రభాస్ ఇంటికి తిరిగిరానున్నారని తెలుస్తోంది.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus