Vishwak Sen: విశ్వక్ సేన్ స్వామి మాల వెనుక వేసుకోవడానికి రీజన్ ఇదేనా?

టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన విశ్వక్ సేన్ గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విశ్వక్ సేన్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. విశ్వక్ సేన్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా ఈ సినిమాల రిలీజ్ డేట్లకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. విశ్వక్ సేన్ తన సినిమాలలో సాంగ్స్ స్పెషల్ గా ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటూ ఉండటం గమనార్హం.

విశ్వక్ సేన్ తాజాగా ఒక ఈవెంట్ లో పాల్గొనగా ఆంజనేయ స్వామి మాలలో విశ్వక్ సేన్ దర్శనమిచ్చారు. ఆంజనేయ స్వామిపై ఉండే భక్తి వల్లే విశ్వక్ సేన్ మాల వేశారని తెలుస్తోంది. ఆంజనేయ స్వామి మాల వేసిన వాళ్లు ఎన్నో నియమ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఆ నిబంధనలు అన్నీ పాటిస్తూ విశ్వక్ సేన్ మాల వేసినట్టు సమాచారం. విశ్వక్ సేన్ భక్తికి నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు.

తన ఇన్ స్టాగ్రామ్ లో జై భజరంగ్ బలి అంటూ విశ్వక్ సేన్ పోస్ట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ కు విశ్వక్ సేన్ వీరాభిమాని కాగా భవిష్యత్తులో ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుందేమో చూడాలి. విశ్వక్ సేన్ డైరెక్టర్ గా మారితే జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు దర్శకత్వం వహించాలని భావిస్తున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా విశ్వక్ సేన్ కు మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందిస్తుందేమో చూడాల్సి ఉంది.

ఆహా ఓటీటీ కోసం విశ్వక్ సేన్ (Vishwak Sen) ఫ్యామిలీ ధమాకా అనే షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ షోకు విశ్వక్ సేన్ కు భారీ రేంజ్ లో పారితోషికం దక్కిందని భోగట్టా. విశ్వక్ సేన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. విశ్వక్ సేన్ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఎంచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. విశ్వక్ సేన్ రాబోయే రోజుల్లో మరిన్ని భారీ విజయాలను సొంతం చేసుకోవడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus