డిసెంబరు మొదటి వారం సినిమాల పంచాయితీ జరుగుతున్న రోజులవి. ఓ యువ హీరో చాలా అగ్రెసివ్‌గా ‘ఒకవేళ మా సినిమా వాయిదా పడితే ఆ సినిమా ప్రచారానికి నేను రాను’ అని కరాఖండీగా చెప్పేశాడు. దీంతో అంత కోపంగా ఎందుకున్నాడు, ఏమైంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ‘ఇండస్ట్రీలో తనను తొక్కేయాలని చూస్తున్నారు’ అంటూ కాస్త ఘాటుగానే విమర్శించాడు. ఆయన అలా ఎందుకున్నాడో కానీ… ఆ సినిమా వాయిదా పడింది. అది కూడా మూడు నెలలు. దీంతో ఎందుకబ్బా అనే ప్రశ్న మొదలైంది.
ఇదంతా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari) సినిమా గురించే అని మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ సినిమాను ముందుగా అనుకున్న ప్రకారం డిసెంబర్ 8న కాకుండా మార్చి 8న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఇటీవల చెప్పారు. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా గురించి టీమ్ చాలా రోజుల క్రితమే తమ సినిమా ప్రచారం ప్రారంభించింది. వివిధ కారణాల వల్ల, చాలా మార్పుల తర్వాత సినిమాను డిసెంబరు 8న విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ డేట్‌ను కూడా మార్చారు.
ఏ వారమో, రెండు వారాలో అనుకుంటే… ఏకంగా మూడు నెలలు వాయిదా వేశారు. ‘డిసెంబర్ 8 శివాలెత్తిపోద్ది.. గంగమ్మ తల్లిపై ఒట్టు. మహాకాళి మాతో ఉంది’ అంటూ చాలా అగ్రెసివ్‌గా మెసేజ్ పెట్టాడు విశ్వక్‌సేన్. అయితే సినిమా షూటింగ్ ఇంకా పూర్తవ్వలేదని, ఎడిటింగ్ టేబుల్ పై చాలా వర్క్ ఉందని, సినిమా రిలీజ్ ఆలస్యం అవుతుందని నిర్మాత నాగవంశీ చెప్పారు. దీంతో ఏది నిజమో తెలియకు తికమకపడ్డారు ఫ్యాన్స్. ఫైనల్‌గా నిర్మాత మాటే నిజమైంది.
మరీ మూడు నెలలు సినిమాకు టాకాలు వేయాల్సినంత అవసరం ఉందా? అనే ప్రశ్న మొదలైంది. పోనీ సంక్రాంతి సీజన్‌లో పెద్ద సినిమాలతో పోటీ ఎందుకు అనుకున్నారు.. అనుకుంటే ఆ తర్వాతైనా రిలీజ్ చేయాలి. మరీ మార్చి 8 వరకు ఎందుకు ఆగినట్లు. సినిమాకు టాకాలు కాదు ఏకంగా రీషూటింగే ఉంది అని చెబుతారేమో. చూడాలి మరి ఈ విషయంలో విశ్వక్‌సేన్ ఏమంటాడో?
ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!
కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!