బిగ్ బాస్ హౌస్ లో మొదటివారమే ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వడం అనే ప్రక్రియ సర్వసాధారణంగా జరిగేదే. ఇప్పుడు సీజన్ 5లో మొదటి వారం సరయు బిగ్ బాస్ హౌస్ నుంచీ ఎలిమినేట్ అయింది. నిజానికి సరయు గేమ్ బాగాలేదా.. లేదా వేరేవాళ్ల కంటే సరయు వెనకబడింది. ఎందుకు సరయు మొదటివారమే ఎలిమినేట్ అయ్యిందనేది మనం చూసినట్లయితే.
1. ఫస్ట్ వీక్ ఓపెన్ నామినేషన్స్ పెట్టినపుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది మన చేతుల్లో లేని పని. సరయుని నామినేట్ చేసింది మొత్తం ముగ్గురు. వాళ్లలో విజె సన్నీ, మానస్, కాజల్ ఉన్నారు. ఈ ముగ్గురి వల్లే సరయు ఎలిమినేట్ అయ్యిందనే చెప్పాలి.
2. సరయుని విజె సన్నీ నామినేట్ చేసేటపుడు చనువు తీస్కుని పిలుస్తున్నావని, నన్ను అలా పిలవద్దు నాకు నచ్చదని చెప్పాడు. ఇక్కడే సన్నీతో ఆర్గ్యూ కూడా చేసింది సరయు. తనని తాను డిపెండ్ చేస్కునే ప్రయత్నం చేసింది. అలాగే మానస్ వచ్చి డైస్ గేమ్ ఆడేటపుడు ట్రిక్ ప్లే చేసాడు అన్నదని మానస్ నామినేట్ చేశాడు. ఆ తర్వాత కాజల్ ని నామినేట్ చేసిందని తిరిగి కాజల్ నామినేట్ చేసింది. ఇదే సరయుకి మూడు ఓట్లు వచ్చేలా చేసింది. ఇందులో ఒకరు తగ్గినా కూడా నామినేషన్స్ లో ఉండేదే కాదు.
3. సరయు పవర్ రూమ్ టాస్క్ ఆడేటపుడు ఎక్కడా పెద్దగా కనిపించలేదు. ఒకవేళ కనిపించినా కూడా అంత ప్రాధాన్యత లేకుండా పోయింది. ఇక్కడ లహరి, కాజల్, హమీద, లోబో, షన్నూ, ప్రియ, రవి హైలెట్ అయినట్లుగా హైలెట్ అవ్వలేకపోయింది.
4. హౌస్ లో నామినేషన్స్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మన గేమ్ ని ఎనలైజ్ చేస్కోవాలి. ఖచ్చితంగా స్క్రీన్ స్పేస్ కోసం ట్రై చేయాలి. కాజల్ అదే చేసింది. కాజల్ నామినేషన్స్ లో ఉన్నందుకే అందరితో వచ్చి ఆర్గ్యూ చేసే ప్రయత్నం చేసింది. కంటెంట్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసింది.
5. తనతో పాటు నామినేషన్స్ లో ఉన్నవారి కంటే వెనకబడింది సరయు. వారిని ఓవర్ టేక్ చేయలేకపోయింది. మానస్ పవర్ రూమ్ యాక్సెస్ ని సంపాదించాడు. రవి పార్టిసిపెంట్ గా ఎంటర్ టైన్ చేశాడు. కాజల్ కంటెంట్ క్రియేట్ చేసింది. హమీద పవర్ రూమ్ యాక్సెస్ దక్కించుకుంది. ఇలా తనతో ఉన్నవాళ్లు ఏదో ఒక అవుట్ పుట్ ఇచ్చారు. ఇక్కడ సరయు ఈ కంటెంట్ ని క్రియేట్ చేయలేకపోయింది. అందుకే ఎలిమినేట్ అయ్యింది.
Most Recommended Video
టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!