జెనీలియా, రితేష్‌లకు నాగ చైతన్య, సమంతలకు సంబంధం ఏంటంటే..?

తెలుగులో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న జెనీలియా కొంత గ్యాప్ తర్వాత రీ ఎంట్రీకి సిద్ధమైంది.. వరుసగా క్రేజీ ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉంది.. భర్త రితేష్ దేశ్‌ముఖ్‌తో కలిసి రెండు సినిమాల్లో నటిస్తోంది.. అలాగే కన్నడ, తెలుగులో గాలి జనార్థన్ రెడ్డి కొడుకు కిరీటి రెడ్డి హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న చిత్రంలో అతని అక్క పాత్రలో కనిపించనుంది.. ఇక రితేష్ దర్శకుడిగా మరాఠీలో ‘వేడ్’ అనే సినిమా చేస్తున్నాడు.. ఇందులో భార్యభర్తలు హీరో హీరోయిన్లు కాగా..

జియా శంకర్ కీలకపాత్రలో కనిపించనుంది.. నటిగా, నిర్మాతగా జెన్నీకి, డైరెక్టర్‌గా రితేష్‌కి ఇదే ఫస్ట్ మరాఠీ ఫిల్మ్.. ముంబై ఫిల్మ్ కంపెనీ బ్యానర్ మీద జెనీలియా డిసౌజా ప్రొడ్యూస్ చేస్తోంది.. మంగళవారం (డిసెంబర్ 13) ట్రైలర్ రిలీజ్ చేశారు. బాలీవుడ్ అండ్ మరాఠీ వాళ్లకి ఫ్రెష్‌గా, ఆసక్తికరంగా అనిపించొచ్చు కానీ మన టాలీవుడ్ వాళ్లకి మాత్రం షాక్, సర్‌ప్రైజ్ అనే చెప్పాలి..ఎందుకంటే.. ఇది యువసామ్రాట్ నాగ చైతన్య, మాజీ భార్య సమంత జంటగా..

శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్ స్పోర్ట్స్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ‘మజిలీ’ కి అఫీషియల్ రీమేక్.. ట్రైలర్ చూసే వరకు చాలా మందికి ఈ విషయం తెలియదు.. ఒరిజినాలిటీ మిస్ కాకుండా మక్కీకి మక్కీ దింపేశారని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.. చై, సామ్ లానే.. జెన్నీ, రితేష్ రీల్ లైఫ్‌లోనూ భార్యభర్తల్లా కనిపిస్తుండగా.. దివ్యాంశ కౌశిక్ పాత్రలో జియా శంకర్ నటించింది..వాళ్ల ‘మజిలీ’ ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గానే ఉండడంతో పాటు దర్శకుడిగా రితేష్ ఆకట్టుకుంటాడనిపిస్తోంది..

డిసెంబర్ 30న ‘వేడ్’ గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది.. అలాగే ఈ జంట హిందీలో షాద్ అలీ డైరెక్ట్ చేస్తున్న ‘మిస్టర్ మమ్మీ’ లో నటిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ మూవీ ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉండడమే కాక సినిమా మీద అంచనాలు పెంచింది.. ‘నువ్వేకావాలి’ హిందీ రీమేక్ ‘తేఝే మేరీ కసమ్’ తోనే జెన్నీ, రితేష్ కెరీర్ స్టార్ట్ చేశారు.. ఇప్పుడు మరో తెలుగు సినిమా రీమేక్‌తోనే మరాఠీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుండడం విశేషం..

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus