Manchu Vishnu wife Viranica: మంచి విష్ణు భార్య గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు..!

  • October 16, 2021 / 05:27 PM IST

హోరాహోరీగా జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్‌పై గెలుపొందిన మంచు విష్ణు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ వార్తల్లోని వ్యక్తి అయ్యారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇరు వర్గాలు కత్తలు దూసుకోవడంతో పాటు విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్లు విసురుకున్నాయి. అయినప్పటికీ విష్ణు ఎక్కడా బయటపడకుండా సంయమనం పాటించారు. అలాగే కృష్ణ, కృష్ణంరాజు, బాలకృష్ణ వంటి పెద్దలను కలుస్తూ మద్ధతు కూడగొట్టి.. ఎన్నికల్లో విజయం సాధించారు. దీంతో విష్ణుకి సినిమాలకు మించిన పాపులారిటీ లభించింది.

ఈ నేపథ్యంలోనే ఆయన భార్య ఎవరు.. వీరిద్దరి ప్రేమ వివాహం గురించిన వివరాలు తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు.మంచు విష్ణు.. విరనికా రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. విరనికా వరుసకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెల్లెలు అవుతారు. వైఎస్ రాజారెడ్డి నాలుగో కొడుకు సుధాకర్ రెడ్డి, విద్యా రెడ్డి దంపతుల కుమార్తె విరనికా.. ఆమె అమెరికాలో పుట్టి పెరిగారు. వీరి కుటుంబానికి ఆఫ్రికాలో చాలా వ్యాపారులున్నాయి. ఆమె అభిరుచులు, అలవాట్లు, వ్యక్తిత్వానికి మంచు విష్ణు ఫ్లాట్ అయిపోయారు.

ఇద్దరు ప్రేమలో పడటం, కొన్నాళ్లపాటు స్వేచ్ఛగా విహరించిన తర్వాత విష్ణు-విరనికాలు పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. ఈ దంపతులకి నలుగురు పిల్లలున్నారు. విరనికా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండరు. అలాగే టీవీలు, ప్రెస్‌మీట్‌లలో సైతం కనిపించకుండా లో ప్రోఫైల్ మెయింటైన్ చేస్తూ వుంటారు. కానీ వ్యాపారాలు, కుటుంబ విషయాల్లో భర్త మంచు విష్ణుకి చేదోడు వాదోడుగా వుంటున్నారు.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus