దేవి శ్రీ ప్రసాద్ కు పూజిత పొన్నాడకు మధ్య ఉన్న సంబంధం అదేనట…!

కెరీర్ ప్రారంభంలో పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించి.. ఆ తరువాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది వైజాగ్ అమ్మాయి పూజిత పొన్నాడా. ‘దర్శకుడు’ ‘రంగస్థలం’ ‘రాజుగాడు’ ‘బ్రాండ్ బాబు’ ‘హ్యాపీ వెడ్డింగ్’ ‘కల్కి’ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది పూజిత పొన్నాడ. అయితే ఈమెకు ఆశించిన బ్రేక్ ఇంకా రాలేదు. ఇదిలా ఉండగా.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజిత పలు ఆసక్తికరమైన విషయాల పై స్పందించింది.

‘మీరు హీరోయిన్ అవుతాను అన్నప్పుడు మీ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి?’ అని అడిగిన ప్రశ్నకు పూజిత జవాభిస్తూ… ‘మా పేరెంట్స్ అస్సలు ఒప్పుకోలేదు. నేను ఆ మాట చెప్పినప్పటి నుండీ నేనెక్కడికి వెళ్లినా కార్ లోనే వెళ్లి రావాలి అని ఆర్డర్ వేశారు. దాంతో నేను ఎక్కడికి వెళ్లాల్సి వచ్చినా డ్రైవర్ నాకు కాపలాగా ఉండేవాడు. కొన్నాళ్ళు ఉద్యోగం చేసిన తరువాత సినిమాల్లో రాణించాలనే ఫ్యాషన్ తో ఇటు వైపు వచ్చాను.దానికి నా పేరెంట్స్ ఒప్పుకోలేదు.

సినిమాని కెరీర్ గా మార్చుకోవడం వాళ్లకు ఇష్టం లేదు’ అని తెలిపింది. ఇక సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ కు తనకు మధ్య వచ్చిన రూమర్స్ గురించి స్పందిస్తూ.. ‘నేను ఇది వరకు కూడా చెప్పాను. దేవి శ్రీ ప్రసాద్ గారిని నేను మొదట కలిసింది ‘రంగస్థలం’ 100 రోజుల ఫంక్షన్ వేడుకలో..! అంతకు ముందు కానీ.. ఆ తరువాత కానీ ఆయన్ని కలిసింది లేదు. మరి మా మధ్య ఏదో ఉన్నట్టు వార్తలు ఎందుకు వచ్చాయో.. వస్తున్నాయో నాకైతే అర్ధం కావడం లేదు’ అంటూ చెప్పుకొచ్చింది పూజిత పొన్నాడ.

Most Recommended Video

మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా రివ్యూ & రేటింగ్!
అనగనగా ఓ అతిధి సినిమా రివ్యూ & రేటింగ్!
రెండు చేతులా సంపాదిస్తున్న 13 హీరోయిన్లు..వీళ్లది మామూలు తెలివి కాదు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus