ఇద్దరి కాంబినేషన్ లో ఉన్న సీక్రెట్ ఏంటి..?

అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ములతో కలిసి లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈసినిమా సమ్మర్ లో ఏప్రిల్ 16వ తేదిన రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈసినిమా షూటింగ్ లో పాల్గొంటూనే మరో సినిమాని లైన్లో పెట్టాడు చైతూ. విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో థ్యాంక్యూ అనే సినిమాకి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా కథ థ్రిలింగ్ గా ఉండబోతోందట.

ఈ సినిమాలో చైతన్య నెగిటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, ఈసినిమా తర్వాత కూడా వీరిద్దరి కాంబినేషన్ లో ఒక వెబ్ సీరిస్ రాబోతోందనేది టాక్. ఈ వెబ్ సీరిస్ ని ప్రముఖ ఓటీటీ సంస్థతో ఒప్పందం చేస్కున్నారని అంటున్నారు. అయితే, ఈ సీరిస్ కూడా థ్రిల్లర్ కథాంశంగానే ఉండబోతున్నాయనేది సమాచారం. ఇప్పటికే అక్కినేని సమంత ఫ్యామిలీ మాన్ వెబ్ సీరిస్ లో నటిస్తోంది. ఇప్పుడు చైతూ కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు, డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో అయితేనే చేస్తానని కండీషన్ పెట్టాడట.

దీనికి డైరెక్టర్ కూడా ఒప్పుకునేసరికి థ్యాంక్యూ సినిమా చేస్తున్నందుకు గానూ, థ్యాంక్స్ చెప్తున్నాడట. ఇక మరోవైపు వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమాకి కూడా సీక్వల్ ని ప్లాన్ చేస్తున్నారు. క్లైమాక్స్ లో కథ అవ్వదని, పార్ట్ 2లో కంటిన్యూ అయ్యేలా ఇది ఉండబోతోందని కూడా టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా నాగచైతన్య సమంతతో మ్యారేజ్ అయిన తర్వాత రూట్ మార్చాడనే అంటున్నారు అందరూ. మొత్తానికి అదీ మేటర్.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus