బ్రహ్మానందం.. తెలుగు సినిమా పరిశ్రమలో రాబోయే రోజుల్లో ఎంతమంది కమెడియన్స్ ఉన్నప్పటికీ కేవలం కొంతమంది మాత్రమే లెజెండ్స్ గా నిలిచారు. ఆ లెజెండ్స్ లో ఒకరు బ్రహ్మానందం. ఈ కామెడీ ప్రత్యేకించి చేయనక్కర్లేదు. ఆయన ఇచ్చే ఎక్స ప్రెషన్న్ తోనే ప్రేక్షకులకు నవ్వు వచ్చేస్తుంది. సుమారుగా వెయ్యికి పైగా సినిమాల్లో కమెడియన్ గా నటించిన బ్రహ్మానందం ఈమధ్య కాలం లో కాస్త స్పీడ్ తగ్గించాడు. డాక్టర్లు ఇచ్చిన సూచనల మేరకు ఈ నిర్ణయాన్ని ఆయన తీసుకున్నాడు.
గతం లో ఆయన ఏడాదికి 20 నుండి 30 సినిమాల్లో నటించిన సందర్భాలు ఉన్నాయి. కేవలం సినిమాలో బ్రహ్మానందం ఉన్నాడు అని వార్త వస్తే చాలు,రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న లక్షలాది మంది ప్రేక్షకులు కేవలం ఈయన కోసం క్యూ కడుతారు.ఆయన కామెడీ తో యావరేజి సినిమాని బ్లాక్ బస్టర్ హిట్స్ గా చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే బ్రహ్మానందం ని చూసి అప్పట్లో అసూయ పడే కమెడియన్స్ కూడా ఉన్నారట. గతం లో ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.
నేను (Brahmanandam) సినిమాలు చెయ్యడం బాగా తగ్గించినప్పుడు కొంతమంది కమెడియన్స్ చాలా సంతోషించారని, కనీసం ఇప్పటికైనా మాకు అవకాశాలు వస్తాయని అనుకునేవారట. ప్రతీ హీరో కి కానీ, దర్శక నిర్మాతలకు కానీ తమ సినిమాల్లో కమెడియన్ గా పెట్టుకునేందుకు మొట్టమొదట ఛాయస్ గా బ్రహ్మానందం నే తీసుకునేవారని, అందుకారణంగా ఏళ్ళ తరబడి ఇండస్ట్రీ లో ఉంటున్నప్పటికీ బ్రహ్మానందం వల్లే సరైన గుర్తింపు రాలేదని భావించేవాళ్లు ఉన్నారట.
ఈ విషయాన్నీ స్వయంగా బ్రహ్మానందం చెప్పుకొచ్చాడు. అయితే ఒక కమెడియన్ మాత్రం నేను రిటైర్ ఐపోయాను అంటూ తన స్నేహితులతో కలిసి సంబరాలు చేసుకున్నాడట, కామెడీ లో బ్రహ్మానందం తర్వాత ఇక నేనే అని అందరితో చెప్పుకున్నాడు. అతను ఎవరో నాకు తెలుసు కానీ ఈ క్షణం లో పేరు చెప్పను అంటూ బ్రహ్మానందం చేసిన కామెంట్స్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.ఇంతకీ ఆ కమెడియన్ ఎవరు ఏమిటి అనే విషయం పై సోషల్ మీడియా లో ఆరాలు తీస్తున్నారు నెటిజెన్స్.