Sai Dharam Tej: వామ్మో.. సాయితేజ్ లుంగీ లుక్ వెనుక ఇంత కథ ఉందా?

సాయితేజ్ నటించిన విరూపాక్ష మూవీ మరికొన్ని గంటల్లో థియేటర్లలో విడుదల కానుంది. సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు బుకింగ్స్ పరవాలేదనే స్థాయిలో ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో సాయితేజ్ ఎక్కడికి వెళ్లినా లుంగీ లుక్ లో కనిపిస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఈ లుక్ లో కనిపించడం గురించి ప్రశ్న ఎదురుకాగా సాయితేజ్ స్పందించి స్పష్టత ఇచ్చారు.

బ్రాండ్ ప్రమోషన్స్ కోసం లుంగీ ధరిస్తున్నారా అనే ప్రశ్నకు బ్రాండ్, ప్రమోషన్స్ ఏం లేవని తెలిపారు. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా విడుదలవుతోందని ఆయన కామెంట్లు చేశారు. అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నానని తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా లుంగీ కడుతున్నానని సాయితేజ్ అన్నారు. అందులోనూ వేసవి కాలం కానుక గాలి బాగా ఆడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

విరూపాక్ష సినిమాను కాంతారతో పోల్చలేమని ఆయన కామెంట్లు చేశారు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కిందని సాయితేజ్ చెప్పుకొచ్చారు. తొలిసారి కొత్త జానర్ లో నటిస్తున్నానని సాయితేజ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మొదట ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేసి తర్వాత అన్ని భాషల్లో రిలీజ్ చేస్తామని సాయితేజ్ చెప్పుకొచ్చారు. సుకుమార్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే ఇచ్చారని సాయితేజ్ పేర్కొన్నారు.

సుకుమార్ స్క్రీన్ ప్లేతో తెరకెక్కిన సినిమాలు సక్సెస్ సాధించిన నేపథ్యంలో (Sai Dharam Tej) సాయితేజ్ ఈ సినిమా విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఈ సినిమాకు 24 కోట్ల రూపాయల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది. సాయితేజ్ ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది. సాయితేజ్ రెమ్యునరేషన్ 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus