Malavika: పాపం.. ‘కె.జి.ఎఫ్’ ఫేమ్ మాళవిక జీవితంలోని విషాదం గురించి తెలిస్తే తట్టుకోలేరు..!

దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యష్ కాంబినేషన్లో రూపొందిన ‘కె.జి.ఎఫ్'(సిరీస్) కు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓ కన్నడ సినిమా ఇన్ని అద్భుతాలు చేస్తుందా? అని ఆశ్చర్యపడేలా ఆ మూవీ సృష్టించిన రికార్డులు ఎన్నో.! ఈ చిత్రంలో నటించిన నటీనటులందరూ దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయారు. ఇందులో ఆండ్రీ మాళవిక అవినాష్‌ ఒకరు. ‘ఇప్పుడేం చేస్తాడు మీ హీరో?’.. అనే డైలాగ్ వినపడింది అంటే టక్కున మైండ్లో ఈమె రూపమే మెదులుతుంది.

నిజానికి ‘కె.జి.ఎఫ్'(సిరీస్) కథను మొత్తం నడిపించేది ఆండ్రీ మాళవిక అవినాష్‌ అనే చెప్పాలి ..! ఈమె చాలా కన్నడ సినిమాల్లో, సీరియల్స్ లో నటించినప్పటికీ ‘కె.జి.ఎఫ్’ తెచ్చిపెట్టిన గుర్తింపు అంతా ఇంతా కాదు. ఇదిలా ఉండగా.. సినిమాల్లో ఈమె ఎంత గాంభీర్యంగా కనిపించినా ఈమె నిజ జీవితంలో మాత్రం చాలా విషాదం దాగుందనే విషయం ఎక్కువ మందికి తెలిసుండదు. ఆ విషాదం మాళవిక అవినాష్‌ ను అనుక్షణం బాధపెడుతూనే ఉంటుందట.

అదేంటంటే.. మాళవిక (Malavika) కుమారుడు ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడట.దీనివల్ల 20 ఏళ్ల వయసులోనూ చిన్న పిల్లాడిలానే ఉండిపోయాడు. తన పనులు తాను చేసుకోలేని స్థితిలో అతను ఉన్నాడట. ఓ తల్లికి ఇంతకు మించిన నరకం ఉంటుందా? అందుకే మాళవిక నిత్యం కుమిళిపోతూ ఉంటుందట. ‘దేవుడా నాకెందుకు ఇలాంటి శిక్ష వేశావు’ అంటూ ఒక్కోసారి గుండెలు బాదుకుని మరీ ఏడుస్తుందట. ఓ టీవీ షోలో తన కొడుకుని చూపిస్తూ మాళవిక ఈ విషయాన్ని తెలియజేసింది.

‘ నా కొడుకు ఓల్ఫ్‌ హెర్షన్‌ సిండ్రోమ్‌తో బాధపడుతున్నాడు. కొంతకాలం క్రితమే ఈ విషయం మాకు తెలిసింది. మొదట్లో ఏ డాక్టరూ దీని గురించి మాకు చెప్పలేదు. ఈ వ్యాధి ఉంటే బుద్ధిమాంధ్యం వస్తుంది. మాట్లాడలేరు.నడవడం కూడా ఇబ్బంది. మీది చాలా బ్యాడ్ లక్ అని డాక్టర్లు అన్నారు. పుట్టినప్పటి నుంచి నా కొడుకు అందరిలా లేడు.

అతన్ని చూసిన ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్లు చేసేవారు. 2018 లో అతని ఆరోగ్యం తీవ్రంగా విషమించింది. 50 రోజులు హాస్పిటల్ లో ఉన్నాడు. మమ్మల్ని విడిచి పెట్టి వెళ్లిపోతాడేమో అని భయమేసింది.కానీ తను కోలుకున్నాడు. నాకు అదే చాలు” అంటూ ఎమోషనల్ అయ్యింది మాళవిక.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus