Koratala Siva: అలా జరిగితే నష్టపోతానని కొరటాల శివ అనుకుంటున్నారా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ సినిమా ఊహించని స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కాల్సి ఉండగా ఈ సినిమా అంతకంతకూ ఆలస్యం అవుతుండటంతో ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై ఆసక్తి అంతకంతకూ తగ్గుతోంది. కొరటాల శివ గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. ఈ రీజన్ వల్ల ఎన్టీఆర్30 గురించి కొరటాల శివ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

మరోవైపు తారక్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నా కొరటాల శివ సినిమా కోసం బరువు తగ్గుతున్నారే తప్ప సినిమా గురించి వైరల్ అవుతున్న వార్తలపై స్పందించడానికి కానీ ఆ వార్తలను ఖండించడానికి కానీ ఏ మాత్రం ఇష్టపడలేదు. సాధారణంగా రాజమౌళి డైరెక్షన్ లో నటించి హిట్ కొట్టిన హీరో తర్వాత సినిమా ఫ్లాప్ అవుతుందని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఇప్పటివరకు ఏ స్టార్ డైరెక్టర్ కూడా ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేయలేకపోయారు.

ఈ సెంటిమెంట్ ను కచ్చితంగా బ్రేక్ చేయాలనే ఆలోచనతో కొరటాల శివ ఈ సినిమా కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ తో సినిమా తీసి ఆ సినిమా హిట్ కాకపోతే తన కెరీర్ ప్రమాదంలో పడుతుందని కూడా కొరటాల శివ భావిస్తున్నారని బోగట్టా. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కంగారు పడాల్సిన అవసరం లేదని నవంబర్ నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కచ్చితంగా మొదలయ్యే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఎన్టీఆర్ సైతం కొరటాల శివను తొందరపెట్టడం కరెక్ట్ కాదని భావిస్తున్నట్టు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కళ్యాణ్ రామ్ ఈ సినిమా నిర్మాతలలో ఒకరు కావడంతో తారక్ మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus