Bigg Boss 7 Telugu: ఎలిమినేషన్ ఎందుకు తీసేశారు ? తెరవెనుక ఏం జరుగుతోందంటే..!

బిగ్ బాస్ ఎపిసోడ్ ఆదివారం చాలా చప్పగా సాగింది. అస్సలు కంటెంట్ లేకుండా అక్కడక్కడా శివాజీపై పంచులు వేస్తూ హోస్ట్ నాగార్జున బండి లాగించేశారు. సండే ఫన్ డే బదులుగా సండే బోరింగ్ డే గా సాగింది. అందులోనూ ఎలిమినేషన్ లేకపోవడం అనేది హౌస్మేట్స్ తో పాటుగా ఆడియన్స్ కి సైతం షాక్ ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా హౌస్ మేట్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. దీనికి హోస్ట్ నాగార్జున చెప్పిన కారణం అస్సలు సెట్ కాలేదు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ యావర్ తిరిగి ఇచ్చేయడం వల్ల ఈవారం ఎవరూ ఎలిమినేట్ అవ్వలేదని హోస్ట్ నాగార్జున చెప్పాడు. అయితే, ఇక్కడ ఆడియన్స్ కి సైతం ఇది అర్దం కాలేదు.

యావర్ ఎవిక్షన్ ఫ్రీపాస్ తిరిగి ఇచ్చేస్తే హౌస్ లో ఎవరినీ ఎందుకు ఎలిమినేట్ చేయలేదని కామెంట్స్ చేస్తున్నారు. గత సీజన్స్ లో ఈ పాస్ వల్ల అన్ ఫైయిర్ ఎలిమినేషన్ జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పి గుర్తు చేస్తున్నారు. అంతేకాదు, యాంకర్ రవి కూడా ఈ పాస్ వల్లే ఎలిమినేట్ అయ్యాడని, ఓటింగ్ లో టాప్ లో ఉండి కూడా ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చిందని అంటున్నారు. బిగ్ బాస్ చూసే ప్రేక్షకులు ప్రతి విషయాన్ని బాగా ఫాలో అవుతూ ఉంటారు. అలాగే ఈ ఎవిక్షన్ ఫ్రీపాస్ ని కూడా ఎలా ఉపయోగించుకోవాలో హౌస్ మేట్స్ కంటే కూడా ఆడియన్స్ కి బాగా తెలుసు.

అలాంటపుడు ఇది అడ్డం పెట్టుకుని ఎలిమినేషన్ ఎలా ఎత్తేస్తారు అనేది ప్రశ్నిస్తున్నారు. ఈవిషయం పక్కనబెడితే, ఆదివారం చివర్లో గౌతమ్ ఇంకా అశ్విని ఇద్దరూ ఉన్నారు. ఈ టైమ్ లో శివాజీ అర్జున్ చెవిలో గౌతమ్ అని చెప్పాడు. నాగార్జున శివాజీ ఏం చెప్తున్నాడు అని అడిగితే గౌతమ్ అని అన్నాడని చెప్పాడు. అయితే, ఇద్దరూ సేఫ్ అవ్వడంతో హౌస్ మేట్స్ గోల చేశారు. కానీ, నాగార్జున హౌస్ మేట్స్ కి నెక్ట్స్ వీక్ డబులు ఎలిమినేషన్ ఉంటుందని అన్నాడు. ఇప్పుడు బిగ్ బాస్ స్టార్ మా బ్యాచ్ అయిన వాళ్లని కాపాడాలనే ఉద్దేశ్యంతోనే ఇలా చేశారని అందుకే, ఈవారం ఎలిమినేషన్ చేయలేదని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

శోభాశెట్టి, ప్రియాంక, అమర్ దీప్, గౌతమ్ వీళ్లని (Bigg Boss 7 Telugu) బిగ్ బాస్ టీమ్ బాగా సపోర్ట్ చేస్తోందని, వీళ్లు డేంజర్ జోన్ లో ఉన్నప్పుడు ఇలా ఎలిమినేషన్ తీసేయడం కరెక్ట్ కాదని చెప్తున్నారు. అలాగే, యావర్ తను గేమ్ లో చేసిన చీటింగ్ ని చూపించేసరికి మిగతా హౌస్ మేట్స్ కి కూడా క్లారిటీ వచ్చింది. అంతేకాదు, నామినేషన్స్ లో కూడ ఈపాయింట్స్ ని హౌస్ మేట్స్ హైలెట్ చేసినట్లుగా సమాచారం. మరి ఈవారం నామినేషన్స్ లో ఎవరెవరు ఉంటారు అనేది ఆసక్తికరంగా మారింది. అదీ మేటర్.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus