యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన అరవింద సమేత సినిమా అంచనాలను మించి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత తారక్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉన్నా ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఆ సినిమా స్థానంలో తారక్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నారు. అయితే ఆ సినిమా ఎందుకు ఆగిపోయిందనే ప్రశ్నకు సమాధానం మాత్రం దొరకలేదు. అయితే నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ ప్రాజెక్ట్ గురించి క్లారిటీ ఇచ్చారు.
భీమ్లా నాయక్ లో పవన్ నటించేలా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒప్పించారని మలయాళంలో మూలకథ దెబ్బతినకుండా భీమ్లా నాయక్ తెరకెక్కేలా త్రివిక్రమ్ కీలక మార్పులు చేశారని నాగవంశీ అన్నారు. పవన్ విశ్వరూపంను భీమ్లా నాయక్ సినిమాలో చూడవచ్చని నాగవంశీ చెప్పుకొచ్చారు. పవన్ తో భీమ్లా నాయక్ కాకుండా మరో మూవీ చేయాలనుకుంటున్నానని ఆయన తెలిపారు. ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ ఆగిపోయిందని అందరూ అనుకుంటున్నారని అలా వైరల్ అయిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని నాగవంశీ వెల్లడించారు.
భారీ బడ్జెట్ తో సినిమా తెరకెక్కాల్సి ఉండటంతో వాయిదా పడిందని ఆయన అన్నారు. సరైన సమయం కోసం ఆ ప్రాజెక్ట్ ను వాయిదా వేశామని ఇండియాలోనే బిగ్గెస్ట్ సినిమాలలో ఒకటిగా ఆ సినిమా నిలుస్తుందని నాగవంశీ వెల్లడించారు. డీజే టిల్లు సినిమాను భారీ బడ్జెట్ తోనే నిర్మించామని నాగవంశీ చెప్పుకొచ్చారు. బన్నీతో, చరణ్ తో సినిమాలు చేయాలని ఉందని త్రివిక్రమ్ చరణ్ కాంబోలో సినిమాను ప్లాన్ చేస్తున్నామని నాగవంశీ అన్నారు.
లాక్ డౌన్ సమయంలో ఒక మాదిరి బడ్జెట్ లో సినిమాలు చేయాలని అనుకొని మూడు సినిమాలు ప్లాన్ చేశామని ఆ సినిమాలలో డీజే టిల్లు ఒకటని నాగవంశీ చెప్పుకొచ్చారు. నాగవంశీ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబో మూవీ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాల్సి ఉంది.
Most Recommended Video
బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!