ప్రభాస్ అభిమానులతో పాటు యావత్ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ గ్లింప్స్ వచ్చేసింది. ఒక నిమిషం 16 సెకన్ల నిడివి కలిగి ఈ గ్లింప్స్ ఉంది. ఇందులో ప్రభాస్ సూపర్ నేచురల్ పవర్స్ ఉన్న వ్యక్తిగా కనిపించబోతున్నాడు అని క్లారిటీ ఇచ్చేశారు. మొహానికి ముసుగువేసి అమితాబ్ ను కూడా కొన్ని షాట్స్ లో చూపించారు. ఇక ఈ చిత్రానికి ‘కల్కి 2898 -AD ‘ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు ప్రకటించారు.
అసలు ‘కల్కి 2898 ‘ అంటే ఏంటి అనే డిస్కషన్ ఇప్పుడు సర్వత్రా జరుగుతుంది. కలియుగం చివర్లో విష్ణువు పదో అవతారమే కల్కి అని పురాణాలు చెబుతున్నాయి. ప్రపంచాన్ని చీకటి కమ్మేసినప్పుడు విష్ణువు కల్కి లా ఉద్బవించి.. శత్రు సంహారం చేసి అందరినీ కాపాడతాడు అని పురాణాలను చదివిన మేధావులు చెబుతున్నారు. అంటే ప్రాజెక్ట్ కె అదే కల్కి 2898 -AD కథ కూడా యుగాంతం నేపథ్యంలో ఉండబోతుందన్న మాట.
కాకపోతే ఇది 2898 వ సంవత్సరంలో అంటే భవిష్యత్తులో వచ్చే యుగాంతాన్ని ఆధారం చేసుకుని దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ కథని డిజైన్ చేసుకున్నట్టు స్పష్టమవుతుంది. ఇక గ్లింప్స్ లో యాక్షన్ సీక్వెన్స్ లు ఓ రేంజ్లో ఉన్నాయి. హాలీవుడ్ సినిమాలను తలపిస్తున్నాయి. సంతోష్ నారాయణ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ‘దసరా’ ని గుర్తుచేసినప్పటికీ బాగానే ఉంది. డి.జార్జ్ సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది.