Thammudu Movie: ‘తమ్ముడు’ టైటిల్ వెనుక ఇంత కథ నడిచిందా.. అస్సలు ఊహించలేదబ్బా..!

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రిఫరెన్సులు వాడుకోవడానికి ముందు వరుసలో ఉంటాడు నితిన్. తన మొదటి సినిమా ‘జయం’ నుండి పవన్ కళ్యాణ్ సినిమాలకి సంబంధించిన ఏదో ఒక రిఫరెన్స్ వాడుతూ ఉండేవాడు. ఒక పోస్టర్ లేదా సినిమాలోని క్లిప్పింగ్స్ ఇలా ఏదో ఒక పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ నితిన్ సినిమాల్లో కనిపిస్తూ ఉంటుంది. తప్పులేదు నితిన్… పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా నితిన్ కు (Nithiin) చాలా సపోర్ట్ చేస్తుంటాడు.

Thammudu

‘ఇష్క్’ సినిమా ఆడియో లాంచ్ కి గెస్ట్ గా వెళ్లి.. నితిన్ (Nithiin) ని సపోర్ట్ చేశాడు. ఆ సినిమా సక్సెస్ కావడానికి తను కూడా ఓ కారణం అయ్యాడు. తర్వాత వచ్చిన ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమా విషయంలో కూడా అంతే..! తర్వాత పవన్ వల్లే ‘అఆ’ అనే సినిమా నితిన్ తో చేశాడు త్రివిక్రమ్. ఆ తర్వాత పవన్, త్రివిక్రమ్ కలిసి నితిన్ తో ‘ఛల్ మోహన్ రంగ’ అనే సినిమా కూడా చేశారు.

అయితే కొన్నాళ్ల నుండి నితిన్ (Nithiin).. పవన్ కళ్యాణ్ రిఫరెన్స్..లు వాడుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఒకవేళ వాడినా అవి హైలెట్ అవ్వడం లేదు. ఈ వారం ‘తమ్ముడు’ (Thammudu) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు నితిన్. ఆ టైటిల్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమాదే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ‘తమ్ముడు’ (Thammudu) అనే టైటిల్ ఈ సినిమాకి పెడుతున్నప్పుడు మొదట నితిన్ ఇష్టం లేదని చెప్పాడట.

ఎందుకంటే ‘తమ్ముడు’ అనే టైటిల్ పెట్టుకుంటే ఫ్యాన్స్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తారు. అప్పుడు ప్రెజర్ పెరుగుతుంది. పైగా పవన్ బ్రాండ్ ను ఎక్కువగా వాడుకుంటున్నట్టు మళ్ళీ విమర్శిస్తారు అని నితిన్ ఫీలయ్యాడట. అయితే దర్శకుడు వేణు శ్రీరామ్, నిర్మాత దిల్ రాజు కన్విన్స్ చేసి ఒప్పించడంతో ఓకే చెప్పినట్లు తెలుస్తుంది.

డబుల్ డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘జాక్’

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus