సానియా – షోయబ్ మాలిక్..ల విడాకులకు మెయిన్ రీజన్ అదేనట..!

ఇండియన్ స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ మూడో పెళ్లి చేసుకుని అందరికీ పెద్ద షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పాకిస్థానీ నటి అయిన సనా జావేద్ ని షోయబ్ మాలిక్ 3వ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి ఫోటోలు షేర్ చేసి మరీ షోయబ్ మాలిక్ ఈ విషయాన్ని ప్రకటించాడు.సానియా మీర్జా కంటే కూడా ముందు అయేషా సిద్దికీ అనే అమ్మాయిని మొదటి వివాహం చేసుకున్నాడు షోయబ్ మాలిక్.

2006 లో ఆమె పెళ్లి చేసుకున్న షోయబ్ మాలిక్.. 2010 లో ఆమెతో విడాకులు తీసుకున్నాడు. అయితే (Sania Mirza) సానియా మీర్జాతో షోయబ్ మాలిక్ ఎప్పుడు విడాకులు తీసుకున్నాడు? ఎందుకు వీళ్ళు విడిపోయారు అనే ప్రశ్నలు చాలా మందిలో మెదులుతూనే ఉన్నాయి. షోయబ్ మాలిక్ – సానియా మీర్జా 6 నెలల క్రితమే విడిపోయినట్టు.. సానియా ఫ్యామిలీ ఇటీవల చెప్పుకొచ్చింది.

కొన్ని పర్సనల్ రీజన్స్ వల్లే వీళ్ళు తమ కెరీర్ కోసం విడాకులు తీసుకున్నట్లు సానియా ఫ్యామిలీ వెల్లడించింది. అలాగే ఇలాంటి కష్ట సమయాల్లో సానియాకి అభిమానులు అండగా నిలబడాలి అని కూడా కోరింది. అయితే బాలీవుడ్ మీడియా సానియా- షోయబ్ మాలిక్.. ల విడాకుల గురించి కొన్ని షాకింగ్ విషయాలు రాసుకొచ్చింది.

షోయబ్ మాలిక్.. సనా జావేద్ తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, అందుకే సానియా తట్టుకోలేక విడాకులు తీసుకుంది అని పేర్కొంది. ఇందులో ఎంతవరకు నిజముందో తెలీదు కానీ.. ఎక్కువగా ఇలాంటి కామెంట్సే సానియా టీం నుండి వినిపిస్తున్నట్లు కూడా బాలీవుడ్ మీడియా రాసుకొచ్చింది.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus