ఆ ఒక్క కారణం వల్లే.. కృష్ణ – బాలు ల మధ్య గ్యాప్ ఏర్పడిందట..!

ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం గారు ఎంత గొప్ప సింగర్, ఎంత గొప్ప వాక్చాతుర్యం కలిగిన వ్యక్తో అందరికీ తెలిసిన సంగతే. ఒకప్పుడు ఇండస్ట్రీకి చెందిన ప్రతి ఒక్కరూ కూడా బాలు గారికి స్నేహితులే. 2020 సెప్టెంబర్ 25న బాలు కోవిడ్ వల్ల మృతి చెందారు. ఆ టైంలో టాలీవుడ్ అంతా ఎంత బాధపడిందో అందరికీ తెలిసిన సంగతే.! అలాంటి బాలు గారు వివాదాల్లో చిక్కుకున్నారు అంటేనే నమ్మడం కష్టం. కానీ ఏకంగా.. సూపర్ స్టార్ కృష్ణ గారితో బాలు గారికి వివాదం ఉంది అంటే నమ్మగలమా? నమ్మడం కష్టమే..!

కానీ కొంతవరకు ఇది నిజమే..! కృష్ణ గారు బాలు గారిని కొంతకాలం దూరం పెట్టారు. నిజానికి ఘంటసాల గారు పీక్స్ లో ఉన్నప్పుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు అవకాశాల కోసం ఎదురు చూసిన క్షణాలు ఉన్నాయి. అయితే ఆ టైంలో కృష్ణ గారు బాలు గారికి సాయం చేశారు. ‘నేను ఏడాదికి తక్కువలో తక్కువ 5 సినిమాల వరకు చేస్తాను. అందులో మీకు అవకాశం ఇప్పిస్తాను అని కృష్ణగారు బాలు గారికి చెప్పారు.

కృష్ణ గారు నటించిన చాలా సినిమాల్లో బాలు గారు అన్ని పాటలు పాడిన సందర్భాలు ఉన్నాయి.అందువల్ల శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి స్టార్ హీరోలకు పాటలు పాడేవారు. కాకపోతే ఒకానొక సందర్భంలో బాలు గారికి కృష్ణ గారికి మధ్య మూడో వ్యక్తి ప్రమేయం ఉండటం, ఆర్థిక పరమైన విషయాల్లో చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ రావడంతో కృష్ణ గారు తన సినిమాల్లో బాలు పాడటానికి వీలు లేదు అని చెప్పి జేసుదాసు,రాజ్ సీతారాం వంటి సింగర్స్ ను ఎంకరేజ్ చేశారు.

వాళ్ళు కూడా మంచి పొజిషన్ కు చేరుకున్నారు. అయితే అందరి స్టార్ హీరోలకు పాటలు పాడుతున్న ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కృష్ణ గారి సినిమాకి పాటలు పడకపోవడం ఏంటి అని వేటూరి గారు భావించారు. అంతేకాకుండా ఆయన ఒకడుగు ముందుకేసి కృష్ణ- బాలు గారి మధ్య ఉన్న గ్యాప్ ను ఫిల్ చేశారు. అప్పుడు మళ్ళీ కృష్ణ- బాలు గారు కలిసి పనిచేశారు

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus