Taapsee: తాప్సీ టాలీవుడ్ కు దూరం అవ్వడానికి అసలు కారణం అదేనంట!

రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది హీరోయిన్ తాప్సి. ఝుమ్మంది నాదం సినిమాలో మంచు మనోజ్ సరసన నటించి తన గ్లామర్ తో అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి వరుస విజయాలు అందుకుంది. కానీ కెరీర్లో తాప్సీ ఎక్కువగా సెకండ్ హీరోయిన్ గానే నటించడంతో ఆమెకు మెయిన్ హీరోయిన్ ఛాన్సులు తగ్గాయి. దీంతో తెలుగు ఇండస్ట్రీకి దూరం అయిందనే వార్తలు వచ్చాయి.

అదే సమయంలో బాలీవుడ్ లో అవకాశం రావడంతో అక్కడికి వెళ్లి క్లిక్ అయింది తాప్సీ. అయితే వాస్తవానికి తెలుగు చిత్ర పరిశ్రమకు తాప్సీ దూరం కావడానికి ఆమెకు బలమైన కారణం ఉందట. అదేంటంటే.. టాలీవుడ్ లోని ఓ స్టార్ హీరో కొడుకు తాప్సీతో మాయ మాటలు చెప్పి ప్రేమలో పడేసి తన వెంట తిప్పుకున్నాడట. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని ఫుల్ ఎంజాయ్ చేశారట. చివరకు పెళ్లి అనే సరికి చేతులెత్తేశాడట. ఈ ప్రేమ విఫలమైన బాధను తట్టుకోలేక తాప్సీ అతని ముందు ఇండస్ట్రీలో ఉండలేక విడిచి వెళ్లిపోయిందంట.

అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ విషయంపై (Taapsee) తాప్సీ ఎప్పుడూ స్పందించలేదు.. గతంలో కాస్త బొద్దుగా ఉన్న తాప్సీ రకరకాల జిమ్ వర్కౌట్స్ చేసి స్లిమ్ అయింది. ఈ క్యూటీ ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. అంతే కాకుండా సోషట్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్యూటీ తరచుగా గ్లామర్ ఫోటోలను అందులో తన అభిమానుల కోసం పంచుకుంటుంది.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus