Venkatesh: స్క్రిప్ట్ రెడీ అయినా వెంకీ – నీలకంఠ ప్రాజెక్ట్ ఎందుకు ఆగిపోయిందంటే?

విక్టరీ వెంకటేష్ ఈ మధ్య సెలక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. గ్యాప్ తీసుకున్నా పర్వాలేదు.. కొంచెం కొత్తదనం ఉన్న కథలు చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం సైంధవ్..అనే క్రైమ్ డ్రామాలో నటిస్తున్నారు. హిట్ సిరీస్ లు తీసిన శైలేష్ కొలను ఈ చిత్రానికి దర్శకుడు. చాలా వరకు షూటింగ్ కంప్లీట్ అయ్యింది.దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలి అనుకున్నారు. కానీ ఆ టైంకి కంప్లీట్ అవుతుందా లేదా అన్నది అనుమానమే. ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే..

వెంకటేష్ (Venkatesh) తర్వాత ఏ దర్శకుడితో చేస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే వెంకటేష్ కి వివేకా నంద క్యారెక్టర్ లో కనిపించాలి అనే ఇంట్రెస్ట్ ఉంది. ఈ కాన్సెప్ట్ తో ఓ ప్రాజెక్ట్ మొదలైనట్టు గతంలో ప్రచారం జరిగింది. ఆ ప్రాజెక్ట్ టేకాఫ్ చేసిన దర్శకుడు మరెవరో కాదు షో ఫేమ్ నీలకంఠ.అతను తెరకెక్కించిన సర్కిల్ సినిమా ప్రమోషన్స్ లో ఈ విషయం వెంకటేష్ ప్రాజెక్ట్ పై స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. వెంకటేష్ గారితో వివేకానంద కాన్సెప్ట్ తో సీరియల్ ప్లాన్ చేశాం.

స్క్రిప్ట్ కూడా రెడీ అయ్యింది. కానీ ఎందుకో ఈ ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదు. ఆయన ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ గురించి ఆలోచించడం లేదు. కానీ అది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘ అంటూ చెప్పుకొచ్చారు నీలకంఠ. ఆయన మాటలను బట్టి వివేకా నంద పాత్రలో కనిపించడం వెంకటేష్ కి ఇష్టమే కానీ నీలకంఠ చెప్పిన స్క్రిప్ట్ నచ్చలేదేమో అని స్పష్టమవుతుంది.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus