జక్కన్న హీరోల సినిమాల ఫ్లాప్ కు అసలు కారణమిదే..?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి స్టూడెంట్ నంబర్ 1 సినిమా నుంచి బాహుబలి 2 సినిమా వరకు తెరకెక్కించిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అనే సంగతి తెలిసిందే. రాజమౌళి సినిమా అంటే ప్రేక్షకుల్లో విడుదలకు ముందే ఆ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడతాయి. అయితే రాజమౌళి మాత్రం ప్రేక్షకుల అంచనాలను మించి సినిమాలను తెరకెక్కిస్తూ ఉండటంతో ఆ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తున్నాయి.

అయితే రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవుతున్నా ఆయా హీరోల తరువాత సినిమాలు మాత్రం ఫ్లాప్ అవుతున్నాయి. ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ లో స్టూడెంట్ నంబర్ 1, సింహాద్రి, యమదొంగ సినిమాలు తెరకెక్కాయి. అయితే ఎన్టీఆర్ స్టూడెంట్ నంబర్ 1 సినిమా తరువాత నటించిన సుబ్బు, సింహాద్రి తరువాత నటించిన నా అల్లుడు, యమదొంగ సినిమా తరువాత నటించిన కంత్రి సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి.

ప్రభాస్ కూడా రాజమౌళి డైరెక్షన్ లో ఛత్రపతి చేసిన తరువాత పౌర్ణమి సినిమాతో, బాహుబలి 2 సినిమా తరువాత సాహోతో విజయాలను అందుకోలేకపోయారు. రాజమౌళి డైరెక్షన్ లో నితిన్ సై మూవీలో నటించగా నితిన్ తరువాత సినిమా అల్లరి బుల్లోడు సినిమా డిజాస్టర్ గా నిలిచింది. మర్యాదరామన్న మూవీ తర్వాత అప్పల్రాజుతో సునీల్, మగధీర తరువాత ఆరెంజ్ తో రామ్ చరణ్, ఈగ తరువాత ఎటో వెళ్లిపోయింది మనస్సు సినిమాలతో నాని సక్సెస్ సాధించలేకపోయారు.

అయితే రాజమౌళి డైరెక్షన్ లో నటించిన హీరోల తరువాత సినిమాలు ఫ్లాప్ కావడానికి అసలు కారణం వేరే ఉందని ఇండస్ట్రీకి చెందిన కొంతమంది భావిస్తున్నారు. రాజమౌళి తమ సినిమాలతో ఆయా హీరోలను నటుడిగా అన్ని కోణాల్లో ఆవిష్కరిస్తారని.. ఇతర దర్శకులు రాజమౌళి స్థాయిలో హీరోలను చూపించలేకపోవడం సినిమాలకు మైనస్ గా మారుతోందని ఇండస్ట్రీకి చెందిన కొంతమంది అభిప్రాయపడుతున్నారు. రాజమౌళి మూవీతో భారీ బ్లాక్ బస్టర్ హిట్లు సాధించిన హీరోల తరువాత సినిమాలపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయని ఆ అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయినా సినిమా ఫ్లాప్ అవుతోందని ఇండస్ట్రీ పెద్దలు చెబుతున్నారు.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus