Radhe Shyam: రాధేశ్యామ్ మేకర్స్ వెనక్కు తగ్గడానికి కారణమిదేనా?

ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమా థియేటర్లలో రిలీజ్ కావడానికి ఒక్కరోజు సమయం మాత్రమే ఉంది. రిలీజ్ సమయానికి ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలను పెంచడంలో మేకర్స్ సక్సెస్ సాధించారు. రాధేశ్యామ్ సినిమా తొలిరోజు కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సాధించడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. రికార్డు స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే బాహుబలి2, అర్జున్ రెడ్డి సినిమాలలా ముందురోజు రాత్రి రాధేశ్యామ్ కు పెయిడ్ ప్రీమియర్స్ వేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావించారు.

Click Here To Watch Now

మేకర్స్ సైతం మొదట ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్స్ పై ఆసక్తి చూపినా తర్వాత వెనక్కు తగ్గారని సమాచారం. ఈ విధంగా పెయిడ్ ప్రీమియర్స్ విషయంలో మేకర్స్ వెనక్కు తగ్గడానికి ముఖ్యమైన కారణమే ఉందని సమాచారం అందుతోంది. రాధేశ్యామ్ సినిమాను నిర్మాతలు ఇప్పటికే సన్నిహితులకు చూపించారని తెలుస్తోంది. సినిమా చూసిన సన్నిహితులు సినిమా బాగుందని చెప్పారని బోగట్టా. అయితే ఈ సినిమా ప్రేక్షకులకు కొంచెం నిదానంగా ఎక్కే సినిమా అని పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా రిస్క్ తీసుకోవద్దని చెప్పారని సమాచారం.

తెలంగాణలోని కొన్ని థియేటర్లలో ఈ సినిమా బెనిఫిట్ షోలకు అనుమతులు లభించాయని తెలుస్తోంది. ఏపీలో బెనిఫిట్ షోలకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. బాక్సాఫీస్ వద్ద రాధేశ్యామ్ ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాల్సి ఉంది. కెరీర్ లో రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడే హీరోలలో ఒకరైన ప్రభాస్ రాధేశ్యామ్ తో మరో సక్సెస్ సాధిస్తానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. జిల్ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోయినా యూవీ క్రియేషన్స్ నిర్మాతలు రాధాకృష్ణ కుమార్ ను నమ్మి మరో ఛాన్స్ ఇచ్చారు.

రాధాకృష్ణ కుమార్ రాధేశ్యామ్ తో సక్సెస్ సాధించి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సి ఉంది. 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus