బిగ్ బాస్ హౌస్ లో ఫినాలే టు టిక్కెట్ కోసం హౌస్ మేట్స్ పోటీ పడుతున్నారు. ఫినాలే అస్త్ర అంటూ బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి టాస్క్ లు ఇస్తున్నాడు. ఇందులో గెలిచిన వారికి 100 పాయింట్స్ వస్తాయ్. అలాగే లాస్ట్ లో ఉన్న వారికి 30 వస్తాయ్. కానీ లాస్ట్ టాస్క్ లో మాత్రం ఓడిన వారికి జీరో పాయింట్స్ పెట్టాడు బిగ్ బాస్. ఇక వరుసగా టాస్క్ లు ప్రారంభం అయ్యాయి. క్లాక్ టాస్క్ లో ప్రియాంక అర్జున్ చివరి వరకూ పోరాడారు. ప్రియాంక ఈ గేమ్ ని చాలా బాగా ఆడింది.
చాలాసేపు అర్జున్ కి టఫ్ ఫైట్ ఇచ్చింది. కానీ లాస్ట్ మినిట్ లో సెకండ్ ప్లేస్ తెచ్చుకుంది. ఇక అర్జున్ కి ఈ టాస్క్ లో 100 పాయింట్స్ వచ్చాయి. ప్రియాంకకి 90 వచ్చాయ్. ఆ తర్వాత యాక్టివిటీ ఏరియా నుంచీ పూలు తెచ్చి గార్డెన్ ఏరియాలోని బ్లాక్స్ లో పేర్చాలని చెప్పాడు బిగ్ బాస్. దీనికోసం హౌస్ మేట్స్ విపరీతంగా పోటీ పడ్డారు. కేవలం చేతులతో మాత్రమే కలక్ట్ చేయాలనే ఉద్దేశ్యంతో శివాజీ కొంచెమే కలక్ట్ చేశాడు. కానీ, మిగతా హౌస్ మేట్స్ మాత్రం టీషర్ట్స్ లో వేసుకుని ఎక్కువ పూలు తీసుకుని వచ్చారు.
ఈ రౌండ్ లో శివాజీ ఇంకా ప్రియాంక ఇద్దరూ లీస్ట్ లో ఉండటం వల్ల టాస్క్ నుంచీ తప్పుకున్నారు. ఇక ఈటాస్క్ అయిన తర్వాత బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. పాయింట్స్ టేబుల్ లో లీస్ట్ లో ఉన్న ఇద్దరూ టిక్కెట్ టు ఫినాలే రేస్ నుంచీ తప్పుకుంటారని అన్నాడు. అంతేకాదు, వాళ్ల పాయింట్స్ ఒకరికి ఇవ్వాలని చెప్పాడు. ఇద్దరూ కలిసి ఒకరికే ఇవ్వాలనే కండీషన్ పెట్టాడు బిగ్ బాస్. ఇది మిగతా పార్టిసిపెంట్స్ కి చాలా అన్ ఫైయిర్ గా అనిపించింది. శివాజీ – శోభా ఇద్దరూ కూడా వాళ్ల పాయింట్స్ ని అమర్ కి ఇచ్చారు.
దీంతో అమర్ పాయింట్స్ టేబుల్ లో పైకి వెళ్లిపోయాడు. నిజానికి ఆటలో వచ్చింది కొన్ని పాయింట్సే, శివాజీ – శోభా కలిసి ఇవ్వడం వల్ల 320పైగా పాయింట్స్ సాధించేశాడు. ఇలా పాయింట్స్ ఇచ్చి పైకి లేపితే టిక్కెట్ టు ఫినాలే పెట్టి అర్దమేంటి ? నిజంగా ఇది అయితే హౌస్ మేట్స్ కి అన్ ఫైయిర్ అనిపించింది. ఇక ఈ టాస్క్ లో పల్లవి ప్రశాంత్ అందరికంటే ఎక్కువ పూలు సేకరించి 100 పాయింట్స్ సాధించాడు. ఆ తర్వాత బిగ్ బాస్ (Bigg Boss 7 Telugu) రింగ్ ని బాల్ పైకి వేసి వాళ్లవైపు లాక్కుని బాస్కెట్ లో వేసే టాస్క్ పెట్టాడు.
ఈ టాస్క్ లో ఫస్ట్ బాల్ ని దక్కించుకుని అర్జున్ మరోసారి 100 పాయింట్స్ సాధించాడు. ఆ తర్వాత ప్రియాంక బాల్ ని తనవైపు లాక్కుంటే, పల్లవి ప్రశాంత్ వచ్చి గద్దలాగా తన్నుకుని వెళ్లిపోయాడు. ఇక్కడ కూడా ప్రియాంకకి అన్యాయం జరిగింది. ఫస్ట్ అర్జున్ బాల్ ని తీసి బాస్కెట్ లో వేస్కున్న తర్వాత ప్రియాంక ఆల్ మోస్ట్ తన లైన్ వరకూ బాల్ ని లాగింది. కానీ ప్రశాంత్ వచ్చి గద్దలా తన్నుకుపోయాడు. నిస్సహాయురాలిలా చూస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత పాపం బాల్ లాస్ట్ వరకూ చిక్కలేదు.
లాస్ట్ లో అమర్ ప్రియాంక ఉన్నప్పుడు ప్రియాంక చక్కగా బాల్ ని లాక్కుంది. కానీ, అమర్ వచ్చి ప్రియాంకపై కలయబడి మరీ గుంజుకున్నాడు. చాలాసేపు పోరాడిన ప్రియాంక అమర్ బలం ముందు నిలవలేకపోయింది. బాల్ ని లాక్కుని అమర్ తన బాస్కెట్ లో వేసుకున్నాడు. దీంతో ప్రియాంక బాగా హర్ట్ అయ్యింది. ఈ మూడు టాస్క్ లలో కూడా ప్రియాంక చాలా బెస్ట్ పెర్ఫామ్ చేసింది. అంతేకాదు, టాస్క్ లు ఎప్పుడు వచ్చినా కూడా చాలా బాగా ఆడుతూ ప్రియాంక బెస్ట్ అనిపించుకుంటోంది.
కానీ, ఈ బాల్ లాక్కోవడం వల్ల అమర్ వరెస్ట్ గేమ్ ఆడాడు. అంతకుముందు యావర్ తో కూడ కలియబడ్డాడు కానీ యావర్ బలం ముందు అమర్ నిలవలేకపోయాడు. ఇక్కడ బాల్ లాక్కోవడం తప్పుకాదు, బాల్ లాక్కుని తీరు తప్పు. చాలాసేపు ప్రియాంక ఫైట్ చేసినా కూడా ఈ గేమ్ లో ఓడిపోయింది. జీరో పాయింట్స్ సాధించింది. అయినా కూడా ఆడియన్స్ మనసుని మాత్రం దోచుకుంది.