ఎంత పెద్ద మహానటి, మహానటుడైనా.. పేజీలకు పేజీల డైలాగుల్ని అవలీలగా చెప్పేవారైనా , సింగిల్ టేక్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్నవారైనా ఒక్కొక్కసారి తప్పులు చేస్తూ వుంటారు. ఇందుకు ఎవరికీ మినహాయింపు కాదు. ఈ విషయం అలనాటి నటి శారద విషయంలోనూ రుజువైంది. జాతీయ ఉత్తమ నటిగా మూడుసార్లు ఎంపికై, ఊర్వశిగా, సహజనటిగా నీరాజనాలు అందుకున్న శారద ఒక సినిమాలో చిన్న సీన్ చేయడానికి ఏకంగా 20 టేకులు తీసుకున్నారట.
వినడానికి ఆశ్చర్యంగా వున్నప్పటికీ ఇది నిజం. అది ఏ సినిమా ఏదో కాదు ‘శారద’. కళాతపస్వి కే. విశ్వనాథ్ దీనికి దర్శకులైతే.. సోగ్గాడు శోభన్ బాబు హీరో. శారద భర్తగా, డాక్టర్ గా శోభన్ బాబు ఇందులో ద్విపాత్రాభినయం చేశారు. ఇక ఆ సీన్ విషయానికి వస్తే.. స్క్రిప్ట్ ప్రకారం శారదకు మతిస్థిమితం తప్పుతుంది. ఆమె సోదరుడు పట్నానికి వెళ్లి డాక్టర్ తో మాట్లాడతాడు. తన చెల్లెలి పరిస్ధితి చెప్పి.. ఆసుపత్రికి తీసుకురమ్మంటే ఇక్కడికే తీసుకొస్తాను అని చెబుతాడు.
దానికి డాక్టర్ పాత్రలో వున్న శోభన్ బాబు.. అవసరం లేదు ‘‘నేనే మీ వూరికి వస్తాను’’ అని చెబుతాడు. ఆ తర్వాత శారద అన్నయ్య వెంట వూరికి వస్తాడు డాక్టర్ పాత్రలోని శోభన్ బాబు. ఇంట్లోకి అడుగుపెట్టగానే డాక్టర్ ని చూసిన శారద తన భర్తేనని అనుకుంటుంది. ఆ వెంటనే ఉద్వేగంతో శోభన్ బాబు కాళ్ల మీద పడి.. నాకెందుకు అన్యాయం చేశారు, నన్ను వదిలి ఎందుకు వెళ్లిపోయారు అంటూ ఏడుస్తుంటుంది.
ఎంతో ఎమోషన్ నిండిన ఈ సీన్ ను కే. విశ్వనాథ్ దాదాపు 20 సార్లు తీశారట. అంటే శారద బాగా నటించలేదని కాదు. నేను అనుకున్న దాని కంటే ఏదో ఎక్స్‌ప్రెషన్ మీ నుంచి వస్తోంది తప్పించి.. తాను ఎదురుచూస్తున్నది రావడం లేదన్నారట విశ్వనాథ్. నటీనటులను ఎక్కడా ఇబ్బంది పెట్టకుండా, విసుక్కోకుండా తనకు నచ్చినట్లు సీన్ వచ్చే వరకు చేయించుకునేవారట విశ్వనాథ్. చివరికి 20 టేకులు పూర్తయిన తర్వాత చివరి టేక్ ను ఓకే చేశారట కళాతపస్వి.
Most Recommended Video
తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?